ఏ మాటక ఆ మాట గత కొన్నేళ్లుగా సినిమా ఫలితాన్ని కొన్ని వెబ్సైట్లు.. యూట్యూబ్ ఛానల్స్ నిర్ణయిస్తున్నాయి అనే విషయం చాలామందికి అవగాహన ఉంది. సినిమా ఎలా ఉన్నా సరే సోషల్ మీడియాలో ప్రమోషన్ చేయాలి అంటే వీటి పాత్ర ఎక్కువ. రివ్యూల రూపంలో సినిమాకు సంబంధించి అనేక విషయాలను వీళ్లు బయటపెడుతూ ఉంటారు. నిర్మాతలు సినిమా ప్రకటనలు ఇస్తే ఒకరకంగా ఇవ్వకపోతే మరొక రకంగా యూట్యూబ్ ఛానల్స్ అలాగే వెబ్సైట్లు కథనాలు రాస్తూ ఉంటాయి.
Also Read : సల్మాన్ ను వెంటాడుతున్న బ్యాడ్ టైం
సినిమా బాగున్న సరే కొంతమంది వెబ్సైట్ నిర్వహకులు బాగా లేదంటూ పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేస్తూ ఉంటారు. నెగిటివ్ రివ్యూలు రాస్తూ సినిమా ఫలితాన్ని మార్చేస్తూ ఉంటారు. బాక్సాఫీసును కూడా ప్రభావితం చేస్తున్న వెబ్సైట్ల విషయంలో నిర్మాతలు ఈ మధ్యకాలంలో కాస్త సీరియస్ గానే ఉంటున్నారు. తాజాగా ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగ వంశీ.. వెబ్సైట్లు అలాగే పలు మీడియా చానల్స్ పై సీరియస్ అయ్యాడు. తమను ఇబ్బంది పెడుతున్న మీడియాకు గట్టి వార్నింగ్ ఇచ్చాడు ఈ స్టార్ నిర్మాత.
Also Read : హైదరాబాద్ ను వేటాడుతున్నాడు..!
మా మీద అంతగా పగ ఉంటే దమ్ముంటే నా సినిమాలు బ్యాన్ చేయండి అంటూ సవాల్ చేసారు. నా సినిమాల పై ఆర్టికల్స్ రాయద్దు , నా సినిమాల రివ్యూలు రాయద్దని స్పష్టం చేసాడు. నా సినిమాలు ఎలా ప్రమోట్ చేసుకోవాలో నాకు తెలుసు అంటూ కొంతమంది మీడియా ప్రతినిధులను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేసాడు. కొన్నాళ్ళుగా మీడియా ప్రతినిధుల విషయంలో నాగ వంశీ ఇదే తరహాలో మాట్లాడటం కొసమెరుపు. ప్రస్తుతం మూడు భారి బడ్జెట్ సినిమాలను లైన్లో పెట్టాడు నాగ వంశీ.

