Wednesday, February 4, 2026 02:47 PM
Wednesday, February 4, 2026 02:47 PM

విజయవాడలో మావో కలకలం..!

ఏపీలో మావోయిస్టు ఎన్‌కౌంటర్ పెద్ద ఎత్తున కలకలం రేపుతోంది. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లిలో మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యులు హిడ్మా అలియాస్ సంతోష్‌తో పాటు మరో ఐదుగురు ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారు. పోలీసులతో జరిపిన ఎదురుకాల్పుల్లో హిడ్మాతో పాటు అతని భార్య రాజక్క అలియాస్ హేమ, మరో నలుగురు టీమ్ సభ్యులు కూడా మృతి చెందారు. ఛత్తీస్‌ఘడ్‌ సుక్మా జిల్లాలోని పూర్వాటి గ్రామంలో జన్మించిన హిడ్మా.. అతి చిన్న వయసులోనే మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యునిగా చేరారు. పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యునిగా కూడా హిడ్మా వ్యవహరిస్తున్నారు.

Also Read : భారత్ లో హమాస్ తరహా దాడులకు ప్లాన్..?

ఆపరేషన్ కగార్‌లో భాగంగా జరిగిన ఈ ఆపరేషన్‌లో ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ లడ్హాతో పాటు మరో ఇద్దరు కీలక అధికారులు కూడా ఈ ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. హిడ్మా ఎన్‌కౌంటర్ తర్వాత ఆ ప్రాంతాన్ని పోలీసులు జల్లెడ పడుతున్నారు. పీపుల్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ కమాండర్‌గా పని చేసిన హిడ్మాపైన కోటి రూపాయల రివార్డు ఉంది. దంతేవాడ, సుక్మా పరిధిలో 30కి పైగా భారీ దాడులకు హిడ్మా నేతృత్వం వహించాడు. తొలి నుంచి ఆపరేషన్ కగార్‌పైన హిడ్మా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అదే సమయంలో ఆయుధాలు వదిలి చర్చలు జరపాలన్న పిలుపును హిడ్మా వ్యతిరేకించాడు కూడా. కీలక నేతల లొంగుబాటు తర్వాత పార్టీకి హిడ్మా సుప్రీంగా వ్యవహరిస్తున్నాడు.

హిడ్మా కోసం ఆపరేషన్ హిడ్మా పేరుతో భద్రతా బలగాలు స్పెషల్ ఆపరేషన్ కూడా చేపట్టాయి. హిడ్మా ఎన్‌కౌంటర్ అనంతరం అక్కడ లభించిన సమాచారం మేరకు పోలీసులు విజయవాడలోని ఆటోనగర్‌లో ఓ ఇంటిపై దాడి నిర్వహించారు. సుమారు పది రోజులుగా విజయవాడలోని ఆటోనగర్ వంద అడుగుల రోడ్డులో సుమారు 27 మంది మావోయిస్టులు షెల్టర్ తీసుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. విజయవాడ వంటి నగరాన్ని మావోయిస్టులు సేఫ్ జోన్‌గా చేసుకోవడం పట్ల పోలీసులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా జిల్లా ఎస్పీ విద్యా సాగర్ ఆధ్వర్యంలో ఆక్టోపస్, గ్రౌహౌండ్స్ దళాలు పీపుల్ గెరిల్లా ఆర్మీ గ్రూప్‌నకు చెందిన 27 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 21 మంది మహిళలు, ఆరుగురు పురుషులు ఉన్నట్లు తెలుస్తోంది. అరెస్టయిన మావోయిస్టుల్లో నలుగురు కీలక నేతలున్నట్లు కూడా తెలుస్తోంది. వీళ్లంతా ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వారిగా గుర్తించారు. వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఫ్యూచర్ ప్లాన్ ఏమిటనే విషయంపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.

Also Read : చిక్కుల్లో జక్కన్న.. పోలీస్ కేసు నమోదు

వీఐపీ నగరంగా గుర్తింపు పొందిన విజయవాడను మావోయిస్టులు షెల్టర్‌ జోన్ చేసుకోవడం వెనుక ఏమైనా కుట్ర ఉందా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. గెరిల్లా ఆర్మీకి చెందిన 27 మందిని విజయవాడకు ఎవరు తీసుకువచ్చారు.. ఆటోనగర్‌లో మూడు అంతస్తుల భవనం అద్దెకు తీసుకోవటం వెనుక ఎవరున్నారు.. వీరితో పాటు ఇంకా ఎవరెవరు విజయవాడ సహా చుట్టు పక్కల ఉంటున్నారనే విషయంపై పోలీసులు విచారణ చేస్తున్నారు. వీరి వద్ద దొరికిన సమాచారంపై పోలీసులు విశ్లేషణ చేస్తున్నారు. గెరిల్లా ఆర్మీ వద్ద వీఐపీల సమాచారం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మొత్తానికి విజయవాడలో మావోయిస్టు కార్యకలాపాలు.. పెద్ద ఎత్తున కలకలం రేపుతున్నాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?

కూటమి అంటే.. ఒక ఉమ్మడి కుటుంబం...

ఏపీ కేబినేట్ సంచలన...

తిరుమల కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి...

దమ్ముంటే అసెంబ్లీకి రా.....

గత రెండు రోజులుగా తనను ఉద్దేశించి...

పోల్స్