Sunday, March 22, 2026 05:21 AM
Sunday, March 22, 2026 05:21 AM

అమరావతిలో వర్చువల్‌ స్టూడియోలు…. మల్టీ మీడియాలో లక్షన్నర జాబ్స్..!!

రాష్ట్రానికి పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తున్నారు ఏపీ మంత్రి నారా లోకేష్. అమరావతిని మల్టీమీడియా హబ్‌గా మార్చడానికి అనేక కంపెనీల ప్రతినిధులతో సమావేశం అయ్యారు. అమరావతిని ఏఐ ఆధారిత స్టూడియోలు.. వర్చువల్‌ రియాలిటీ థీమ్‌ పార్కులతో ట్రాన్స్‌ మీడియా నగరంగా అభివృద్ధి చేయడానికి క్రియేటివ్‌ ల్యాండ్‌ సంస్థతో గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకొంది. ఈ ప్రాజెక్టు కోసం 10 వేల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. క్రియేటివ్‌ ల్యాండ్‌ ప్రాజెక్టు ద్వారా అమరావతిలో లక్షా 50 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి.

Also Read : లోకేష్ పేరు వాడితే అంతే.. టీడీపీ నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్..?

ప్రముఖ డిజైనింగ్‌ సంస్థ.. కాన్వా ప్రతినిధులను కలిసి మంత్రి నారా లోకేష్.. క్రియేటివ్‌ ల్యాండ్‌ ప్రాజెక్టులో భాగస్వామ్యం కావాలని ఆహ్వానించారు. ఆర్కిటెక్చర్, ఇండస్ట్రియల్‌ డిజైన్‌ సాఫ్ట్‌వేర్‌ తయారు చేసే ఆటో డెస్క్‌ సీటీవో దేవ్‌ పటేల్‌తో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. ఏపీ రాజధాని అమరావతితో పాటు రాష్ట్రంలోని తీర ప్రాంతాల్లో తుఫానులను తట్టుకొనే భవన నిర్మాణాల కోసం సాంకేతిక సహకారం అందించాలని కోరారు.

Also Read : ఫైల్స్ క్రియేట్ చేయొద్దు.. చంద్రబాబు సంచలన కామెంట్స్

అమరావతిలో క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాలని.. రిగెట్టి కంప్యూటింగ్ సంస్థ ముందు ప్రతిపాదనలు ఉంచారు మంత్రి లోకేష్. ఇప్పటికే ఐబీఎం, మైక్రోసాఫ్ట్‌ వంటి ఐటీ దిగ్గజాలు.. అమరావతిలో క్వాంటం కంప్యూటర్లు ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చాయి. ఈ రంగంలో అగ్రగామిగా ఉన్న కంపెనీలను తీసుకురావడం ద్వారా.. అమరావతిని క్వాంటం కంప్యూటింగ్‌ క్లౌడ్‌ సెంటర్‌గా నిలిపేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్