ఈ రోజుల్లో బంధువు ఎమ్మెల్యే అయితే.. ఎమ్మెల్యే స్టిక్కర్ లు వేసుకుని టోల్ గేట్స్ తప్పించుకునే ప్రయత్నం చేయడం చూస్తూనే ఉంటాం. ఫ్రెండ్ మంత్రి అయితే.. ఫ్రీగా విమానాల్లో ప్రభుత్వ సొమ్ముతో ప్రయాణాలు చేసే వారిని చూస్తూ ఉంటాం. ఐడీ కార్డులు చూపించి టోల్ ఫీజులు కట్టకుండా తప్పించుకునే కక్కుర్తి మానవులు ఎందరో. అలాంటిది ఓ ముఖ్యమంత్రికి కొడుకు అయితే..? కీలక శాఖలకు మంత్రి అయితే..? ఉండే సౌకర్యాలకు లెక్కే లేదు. జేబులో పైసా ఖర్చు లేకుండా ప్రపంచాన్ని చుట్టేయొచ్చు. ఏదోక బిల్ పెట్టి మ్యానేజ్ చేసేయొచ్చు.
Also Read : పరువు తీస్తున్నారు కదరా అయ్యా..!
కానీ ఇది ఏపీ విద్యా శాఖ, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పూర్తిగా భిన్నం. ప్రభుత్వం కల్పించే సౌకర్యాలు అన్నీ ఉన్నప్పటికీ జేబులో డబ్బులనే ఖర్చు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు లోకేష్. అసలు ఈ విషయం ఎలా బయటపడిందో చూద్దాం. సాధారణంగా టీడీపీ నేతల జేబుల్లో, సూట్ కేసుల్లో, బీరువాల్లో, జేబులో ఉండే పర్సుల్లో భూతద్దం పెట్టి చూసే సాక్షి మీడియా పుణ్యమా అని అసలు విషయం బయటపడింది. కూటమి ప్రభుత్వం వచ్చాక 77 సార్లు విమానం ఎక్కి దిగారని ‘సాక్షి’లో ఓ వార్త వచ్చింది.
యధావిధిగా అది ఫేక్ న్యూస్ అనే క్లారిటీ వచ్చింది. సమాచార హక్కు చట్టం ద్వారా పూర్తి విషయాలు వెలుగులోకి వచ్చేసాయి. లోకేష్ ఎక్కడకు వెళ్ళినా సరే.. తన పర్యటనల కోసం.. సొంత సొమ్మే లోకేష్ ఖర్చు చేస్తున్నారని వెల్లడి అయింది. తన పర్యటనల ఫ్లైట్ చార్జీలకు లోకేష్ చెల్లిస్తున్నట్టు గుర్తించారు. తన శాఖలు మానవ వనరులు, ఐటి, ఎలక్ట్రానిక్స్, ఆర్టిజి నుంచి మంత్రి రూపాయి కూడా తీసుకోవడం లేదని తేల్చారు. టోల్ ఫీజులు కూడా లోకేష్ తన జేబులో డబ్బులే కడుతున్నట్టు తేలింది.
Also Read : శివజ్యోతికి టీటీడీ షాక్.. శభాష్ అంటున్న భక్తులు..
గతంలో కూడా లోకేష్ చిరు – తిండి సహా పలు విషయాలపై సాక్షి తప్పు కథనాలు ప్రసారం చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయాలు కూడా సమాచార హక్కు చట్టం ద్వారా వెలుగులోకి వచ్చాయి. ఇక ఈ వ్యవహారంలో మంత్రి లోకేష్ పరువు నష్టం దాఖలు చేయగా.. సాక్షి యాజమాన్యం కోర్ట్ చుట్టూ తిరుగుతోంది. ఇక గత ఏడాది విజయవాడ వరదల సమయంలో.. హైదరాబాద్, ముంబైలో ఉంటూ లోకేష్ సేదతీరారంటూ సాక్షి కథనాలు ప్రసారం చేసిన సంగతి తెలిసిందే.

