Monday, October 27, 2025 10:28 PM
Monday, October 27, 2025 10:28 PM
roots

అమెరికాలో పెద్ద ఎత్తున రోడ్డున పడ్డ తెలుగు వాళ్ళు

అమెరికాలో ఎప్పుడు ఎవరి ఉద్యోగాలు పోతాయో తెలియక దిన దిన గండం నూరేళ్ళ ఆయుష్షు అన్నట్టు ఉంది పరిస్థితి. తాజాగా అమెరికన్ ఆడిటింగ్ దిగ్గజం ఫ్యానీ మే.. జీతాల కుంభకోణానికి పాల్పడ్డారనే ఆరోపణలపై దాదాపు 200 మంది ఉద్యోగులను తొలగించింది. వారిలో ఎక్కువ మంది తెలుగువారే . భారత సంతతికి చెందిన ఉద్యోగులను ఒక్కసారిగా తొలగించడంతో గందరగోళం రేగింది. ముగ్గురు భారతీయ-అమెరికన్ చట్టసభ సభ్యులు ఫ్యానీ మేకు వివరణ కోరుతూ లేఖ రాశారు.

Also Read : మహేష్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..!

తెలుగు ఉద్యోగులను విధుల నుంచి తొలగించడం వెనుక సరైన దర్యాప్తు జరగలేదని లేఖలో ప్రస్తావించారు. వర్జీనియాకు చెందిన కాంగ్రెస్ సభ్యుడు సుహాస్ సుబ్రమణ్యం నేతృత్వంలోని ముగ్గురు భారతీయ-అమెరికన్ శాసనసభ్యులు.. దీనిపై అసహనం వ్యక్తం చేసారు. కనీసం దర్యాప్తు, ముందస్తు నోటీసు లేకుండా వారిని తొలగించారని ఆరోపించారు. యాపిల్ లో కూడా జనవరిలో ఇలాగే ఉద్యోగులను భారీగా తొలగించారు. తమ జీతాలను పెంచుకునేందుకు మోసాలకు పాల్పడ్డారని యాపిల్ తొలగించింది.

Also Read : అమెరికాకు టూరిస్ట్ వీసా కూడా కష్టమేనా..? వైరల్ అవుతున్న పోస్ట్

కుపెర్టినోలోని తన ప్రధాన కార్యాలయంలోని దాదాపు 50 మంది ఉద్యోగులను తొలగించింది, వారిలో కొంతమంది భారతీయులు కూడా ఉన్నారు. కంపెనీని మోసం చేయడానికి.. నిధులను దుర్వినియోగం చేసేందుకు తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (TANA)తో కుమ్మక్కయ్యారని అనేక మంది ఉద్యోగులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారని అక్కడి మీడియా వెల్లడించింది. గత గురువారం తొలగించిన ఉద్యోగులలో ఒకరు TANAలో ప్రాంతీయ ఉపాధ్యక్ష పదవిలో ఉన్నారని, మరొకరు అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) మాజీ అధ్యక్షుడి జీవిత భాగస్వామి అని వార్తలు వస్తున్నాయి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్