Monday, October 27, 2025 05:05 PM
Monday, October 27, 2025 05:05 PM
roots

వామ్మో… ఆయన ఇలాంటోడా…!

మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు… కేటీఆర్ క్యారెక్టర్ పైన మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. సమంత, నాగచైతన్య విడాకులకు కేటీఆర్ కారణమని… టాలీవుడ్‌లో హీరోయిన్‌లను వేధిస్తున్నాడని… డ్రగ్స్ తీసుకుంటాడంటూ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్నాయి. ఇవే విమర్శలు కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధానికి తెరలేపాయి. వాస్తవానికి ఈ విమర్శల వెనుక పెద్ద కథే ఉంది. తాజాగా ఓ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ మెడలో బీజేపీ ఎంపీ రఘునందన్ నూలు దండ వేశారు. దీనిపై కేటీఆర్ అనుచరుడు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు పెద్ద దుమారం రేపింది. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారంటూ పెట్టిన పోస్ట్ విమర్శలకు దారి తీసింది. దీనిపై కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్‌ను ముట్టడించారు. కేటీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో మంత్రి కొండా సురేఖ కంటతడి కూడా పెట్టుకున్నారు. తనను అక్కా అంటూ పిలిచే వ్యక్తి నూలు దండ వేస్తే… ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వారిని కేటీఆర్ ప్రొత్సహిస్తున్నారని నిలదీశారు కూడా.

Read Also : సిక్కోలు లో వైసీపీ దుకాణం బంద్…!

అయితే ఈ వివాదం ఇంతటితో ముగుస్తుందని అంతా భావించినప్పటికీ… తాజాగా కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు పెను సంచలనం రేపాయి. కేటీఆర్‌ డ్రగ్స్‌కు అలవాటు పడి.. హీరోయిన్లకు కూడా అలవాటు చేశారన్నారు. రేవ్ పార్టీలు చేసుకుని.. వాళ్లని బ్లాక్ మెయిల్ చేశారన్నారు. ఈ విషయం సినీ ఇండస్ట్రీలోని అందరికీ తెలుసంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్ కన్వెన్షన్ కూల్చివేయకుండా ఉండాలంటే… ఫేవర్ చేయాలంటూ నాగార్జునను కేటీఆర్ బ్లాక్ మెయిల్ చేశాడని… అందుకు సమంత ఒప్పుకోకపోవడం వల్లే నాగ చైతన్య విడాకులు తీసుకున్నారని విమర్శించారు. రకుల్ ప్రీత్ సింగ్ సహా పలువురు హీరోయిన్లు తొందరగా పెళ్లిళ్లు చేసుకుని వెళ్లిపోవడం వెనుక కేటీఆర్ బెదిరింపులున్నాయని కూడా కొండా సురేఖ ఆరోపించారు. అయితే మహిళా మంత్రి ఆరోపణలపై కేటీఆర్ స్పందించలేదు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

ఆర్టీసీ బస్సు తప్పింది.....

కర్నూలు రోడ్డు ప్రమాదం ఘటన విషయంలో...

బుకింగ్ క్యాన్సిల్.. ప్రయాణికులకు...

సాధారణంగా ఏదైనా అనుకోని అగ్ని ప్రమాదం...

పోల్స్