అప్పట్లో సమంత, నాగచైతన్య విషయంలో మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. వాళ్ళిద్దరి వ్యక్తిగత జీవితాలపై.. ఆమె చేసిన వ్యాఖ్యల వ్యవహారం ప్రభుత్వానికి కూడా ఒకంత తలనొప్పిగా మారిన పరిస్థితి చూశాం. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ కూడా చేశారు. అయితే ఆ తర్వాత అక్కినేని నాగార్జున కోర్టులో పరువు నష్టం దావా వేయడంతో ఈ వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఆ తర్వాత కాంగ్రెస్ న్యాయవిభాగం ఆమెకు అండగా నిలబడింది. అయితే గత కొన్ని రోజులుగా కొండా సురేఖకు గడ్డు కాలం నడుస్తోంది.
Also Read : మహిళా నేతల దూకుడు.. కూటమి కొంప ముంచుతుందా..?
ప్రైవేట్ ఓఎస్డి వ్యవహారం, ఆ తర్వాత కుమార్తె సుష్మిత చేసిన వ్యాఖ్యలు కొండా సురేఖ మెడకు చుట్టుకున్నాయి. ఇక అప్పటినుంచి కొండా సురేఖను క్యాబినెట్ నుంచి తొలగించే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. జూబ్లీహిల్స్ ఎన్నికల తర్వాత ఆమెను పక్కకు తప్పించే అవకాశం ఉందనే వార్తలు వచ్చాయి. ఈ సమయంలో కొండా సురేఖ అర్ధరాత్రి సమయంలో చేసిన ఓ పోస్ట్ సంచలనమైంది. అక్కినేని నాగార్జున కుటుంబానికి ఆమె క్షమాపణలు చెప్పారు. నాగార్జున పై తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని.. నాగార్జున కుటుంబాన్ని కించపరిచే ఉద్దేశం తనకు లేదని పేర్కొన్నారు.
Also Read : గూగుల్ తో ఆగని బాబు – లోకేష్.. ఏపిలో అంతకు మించి
నాగార్జున కుటుంబం బాధపడి ఉంటే చింతిస్తున్నానని, తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుంటున్నానని, పోస్ట్ చేశారు. ఇప్పుడు ఈ పోస్ట్ వైరల్ గా మారింది. నాగార్జున వేసిన పిటిషన్ పై నేడు నాంపల్లి కోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఆమె అర్ధరాత్రి క్షమాపణ చెప్పటంతో.. ఈ వ్యవహారం ఇక్కడితో ముగిసిపోయిందనే అభిప్రాయాలు వినపడుతున్నాయి. క్రమంగా ఇది తలనొప్పిగా మారే అవకాశం ఉండటంతోనే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అటు మంత్రివర్గం నుంచి తొలగిస్తే ఆ తర్వాత పార్టీ నుంచి కూడా పెద్దగా సపోర్ట్ ఉండదని.. అందుకే కొండా సురేఖ రాజీమార్గంలో ముందుకు వెళ్లారని తెలుస్తోంది.

