Thursday, February 5, 2026 02:40 AM
Thursday, February 5, 2026 02:40 AM

బ్రేకింగ్: పరకామణి కేసులో కీలక నిందితుడు అనుమానాస్పద మృతి

తిరుమల తిరుపతి దేవస్థానంలో పరకామణి చోరీ వ్యవహారం గత కొన్నాళ్లుగా సంచలనం అవుతుంది. ఈ అంశానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా దృష్టి పెట్టడంతో పరిణామాలు ఆసక్తిని రేపుతున్నాయి. ఈ కేసులో కీలక వ్యక్తులను అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది అనే ప్రచారం జరుగుతున్న సమయంలో.. విచారణలో వెళ్ళడవుతున్న అంశాలు.. రాజకీయ నాయకుల చుట్టూ తిరుగుతున్నాయి. తిరుమల హుండీ లెక్కల్లో.. చోరీ జరిగిందనే అంశానికి సంబంధించి పక్క ఆధారాలను సేకరించిన పోలీసులు విచారణను వేగవంతం చేశారు.

Also Read : మరో స్టార్ క్రికెటర్ రిటైర్మెంట్..?

ఈ అంశాల్లో టీటీడీ అధికారుల పాత్ర పై కూడా తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. దీనికి సంబంధించి ఈ వ్యవహారంలో కీలకంగా ఉన్నటువంటి రవికుమార్, అతని కుటుంబ సభ్యుల స్థిర ఆస్తులు, బ్యాంకు ఖాతాలపై ఏసీబీ అధికారులు దృష్టి సారించారు. లోక్ అదాలత్ ద్వారా ఈ కేసును పరిష్కరించే ప్రయత్నం చేసిన కొందరిపై కూడా హైకోర్టు సీరియస్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా కోర్టు ఉత్తర్వుల ప్రకారం పూర్తిస్థాయిలో విచారణ జరుగుతుంది. ఈ నేపద్యంలో తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది.

Also Read : మాగంటి కోట కూలింది.. జూబ్లిహిల్స్ లో కాంగ్రెస్ భారీ ఆధిక్యం..!

టీటీడీ పరకామణి కేసులో కీలక వ్యక్తిగా భావిస్తున్న టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ అనుమానాస్పద స్థితిలో మరణించారు. తాడిపత్రి సమీపంలోని కోమలి గ్రామం వద్ద రైల్వే ట్రాక్ పై ఆయన మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. పరకామణి చౌరీ కేసులో ఈనెల 6న సతీష్ కుమార్ ను సిఐడి అధికారులు విచారించారు. మరోసారి విచారణకు రావాలని సతీష్ కుమార్ కు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఆయన అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయారు. రైల్వే ట్రాక్ పక్కన రక్తం గాయాలతో సతీష్ కుమార్ మృతదేహాన్ని గుర్తించారు. 2024 నుంచి అతని కుటుంబం అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. ఈ కేసు నుంచి తనను బయట పడేస్తే.. తన ఆస్తులను టిటిడి కి రాయిస్తానని.. సతీష్ కుమార్ పలుసార్లు ప్రతిపాదనలు పెట్టారు. ఇక ఈ కేసు విచారణ కీలక దశలో ఉన్న సమయంలో అతను ప్రాణాలకు కోల్పోవడం కలిగిస్తోంది. వివేకానంద రెడ్డి హత్య కేసు నిందితుల మాదిరిగానే.. పరకామణి కేసులో కూడా నిందితులు మరణించే అవకాశం ఉందనే వార్తల నేపథ్యంలో.. నిందితులపై అధికారులు పూర్తిస్థాయిలో దృష్టి పెట్టారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

గుంటూరు కారమా.. మజాకానా…!

గుంటూరు కారం పవర్ ఇన్నాళ్లకు కన్పించింది.....

బాబు-పవన్ భేటీ.. ఆ...

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్...

చంద్రబాబు సలహదారుగా మళ్లీ...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్...

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

పోల్స్