Sunday, March 22, 2026 07:58 AM
Sunday, March 22, 2026 07:58 AM

చెల్లెమ్మను ఎలా దారిలో పెట్టాలి..?

తెలంగాణా రాజకీయాల్లో.. ఎమ్మెల్సీ కవిత వ్యవహారం ఇప్పుడు ఏ మలుపులు తిరుగుతుందో అనే దాని కంటే.. బీఆర్ఎస్ ఏ విధంగా నష్టపోతుంది అనేదే ప్రధాన ప్రశ్నగా మారింది. రాజకీయంగా ఇబ్బందులు పడుతోన్న బీఆర్ఎస్ లో జోష్ నింపేందుకు కేసీఆర్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సమయంలో కవిత వైఖరి పార్టీ క్యాడర్ ను కుదిపేస్తోంది. మొన్న కేసీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. మాట్లాడిన మాటల కంటే కూడా.. కవిత ఇటీవల కాలంలో చేస్తున్న విమర్శలకే మీడియా హైప్ ఇస్తోంది.

Also Read : భోగాపురం విమానాశ్రయం వాస్తవాలు.. 2015 నుంచి 2024 వరకూ ఏం జరిగింది..?

ఆమె విమర్శల దాడి ఆపాలని పార్టీ పెద్దలు కోరినప్పటికీ కవిత మాత్రం వినడం లేదు. రాజకీయ విమర్శల సంగతి పక్కన పెడితే.. గతంలో అక్రమాలు జరిగాయని కవిత విమర్శిస్తున్నారు. సాగునీటి ప్రాజెక్ట్ లు మొదలు.. ఓఆర్ఆర్ సహా పలు కీలక ప్రాజెక్ట్ లలో అవినీతి జరిగింది అంటూ కవిత దుమ్మెత్తి పోస్తున్నారు. అలాగే మాజీ మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతిపై కవిత ఘాటు విమర్శలు చేస్తున్నారు. ఆమె వ్యాఖ్యలపై ఎవరైనా రియాక్ట్ అయి సమాధానం చెప్తే.. కవిత లెక్కలతో విమర్శించడం మొదలుపెట్టారు.

Also Read : ఆ సీనియర్లకు పదవీ యోగం లేదా..?

దీనితో గులాబీ దండులో కలవరం మొదలైంది. పార్టీ క్యాడర్ సోషల్ మీడియాలో కవితను తిట్టడాన్ని, మీడియా సమావేశాల్లో నాయకులు ఆమెను విమర్శించడాన్ని కేసీఆర్ జీర్ణించుకోవడం లేదనే మాట సైతం వినపడుతోంది. కానీ కవిత మాత్రం కుంబస్థలాన్ని కొట్టే దిశగానే అడుగులు వేస్తున్నారు. ఆమె వద్ద ఉన్న ఆధారాలు ఏంటీ అనే దానిపై కూడా చర్చ మొదలైంది. ఆధారాలు లేకుండా కవిత స్వరం ఆ స్థాయిలో ఉండదు అనే కామెంట్ కూడా ఉంది. ఏదైనా కేసు నమోదు చేస్తే.. కవిత ఆధారాలు సమర్పిస్తే.. హరీష్ రావు, జగదీష్ రెడ్డి లాంటి వాళ్ళు ఇరుక్కుపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. అటు కవిత రాజీకి కూడా రాకపోవడంతో కేటిఆర్, హరీష్ లో కలవరం మొదలయింది అనే కామెంట్స్ వస్తున్నాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్