Monday, October 27, 2025 07:40 PM
Monday, October 27, 2025 07:40 PM
roots

కన్నప్పకు ఎవరి రెమ్యునరేషన్ ఎంత..?

ఈ సంవత్సరం అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో కన్నప్ప ఒకటి. ఈ సినిమా కోసం మంచు విష్ణు అభిమానుల కంటే ప్రభాస్ అభిమానులే ఎక్కువగా ఎదురు చూస్తున్నారు. మంచు విష్ణు కంటే ఇతర నటులే స్టార్లు కావడంతో అభిమానుల్లో సినిమాపై పిచ్చ క్రేజ్ క్రియేట్ అయింది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ తో పాటుగా మోహన్ లాల్, మోహన్ బాబు, అక్షయ్ కుమార్ వంటి నటులు నటిస్తున్నారు. సినిమా బడ్జెట్ కూడా భారీగానే ఉండటంతో ఎవరికి ఎంత రెమ్యునరేషన్ ఇస్తున్నారో ఒకసారి చూద్దాం.

Also Read : ఇరాన్ కు ట్రైనింగ్ ఇచ్చిన అమెరికానే ఇప్పుడు ఎందుకు టెన్షన్ పడుతోంది..?

కన్నప్పలో అక్షయ్ కుమార్ శివుడిగా అతిధి పాత్రలో నటిస్తున్నాడు. ఈ పాత్ర సినిమాలో అత్యంత కీలకం. దీనితో ఈ సినిమా కోసం అతను 6 కోట్లకు పైగానే రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో ఇప్పటికే అక్షయ్ కుమార్ పాత్రకు సంబంధించిన షూటింగ్ కంప్లీట్ చేసారు. ఇక ఈ సినిమాలో కీలక పాత్రలో నటించే మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్.. ఈ సినిమా కోసం రూపాయి కూడా చార్జ్ చేయకుండా నటిస్తున్నాడు అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు.

Also Read : పొగాకు రైతులకు 24 గంటల్లోనే.. చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం

ఇండియాలో అతిపెద్ద స్టార్లలో ఒకరైన ప్రభాస్, కన్నప్పలో రుద్ర పాత్రను పోషిస్తున్నాడు. మోహన్ లాల్ లాగే, ప్రభాస్ కూడా ఈ సినిమాను ఉచితంగా చేసాడు. ఈ విషయాన్ని మంచు విష్ణు ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు. సినిమా రిలీజ్ అయిన తర్వాత వారి కష్టానికి తాను రెమ్యునరేషన్ ఇస్తాను అన్నాడు విష్ణు. ఈ సినిమాలో మంచు విష్ణు తండ్రి మోహన్ బాబు కూడా డబ్బులు తీసుకోలేదు. సినిమాలో ఎక్కువ భాగం న్యూజిలాండ్ లో షూట్ చేయడంతో బడ్జెట్ ఎక్కువైంది అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్