ఉమ్మడి కడప జిల్లాలో ఆ ఎమ్మెల్యే ఒకరు మాత్రమే మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డితో పోరాటం చేస్తున్నారా.. మిగిలిన వారంతా సైలెంట్‌గానే ఉన్నారా… అంటే అవుననే సమాధానమే వస్తుూంది. మాజీ సీఎం జగన్ సొంత జిల్లా కడపలో బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఒక్కరే మనస్ఫూర్తిగా వైసీపీతో పోరాడుతుంటే.. టీడీపీ ఎమ్మెల్యేల్లో ఒక్కరు కూడా ధైర్యంగా వైసీపీతో పోరాడటం లేదు అనే మాట బాగా వినిపిస్తోంది. ఇంకా చెప్పాలంటే.. పగలు టీడీపీ అని చెప్పుకుంటారట.. రాత్రి అయితే వైసీపీ నాయకులతో విందులు, వినోదాల్లో మునిగి తేలి పోతుండటమే కాకుండా, ఆర్ధిక పంపకాల వాటాల పై చర్చించుకుంటారట.
Also Read : ఏపీలో ఏనుగు దంతాల స్మగ్లింగ్ కలకలం..!
పగలు తిట్టుకుంటారట.. రాత్రిళ్లు కలుస్తుంటారట.. 2014 ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన ఆదినారాయణరెడ్డి ఆ తర్వాత టీడీపీలో చేరి మంత్రి కూడా అయ్యారు. మళ్లీ బీజేపీలో చేరి, టీడీపీ పొత్తుతో బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచారు. ఈయన ఒక్కరే ప్రస్తుతం ఒంటరిగా వైసీపీతో పోరాటం చేస్తున్నారు. జగన్ రెడ్డి పై విమర్శలు, ఆరోపణలు చేస్తుంటే.. టీడీపీ మెజారిటీ ఎమ్మెల్యేలు, వారి కుటుంబం సభ్యులు మాత్రం వైసీపీ నాయకులతో తెర వెనుక వ్యాపారాలు, కాంట్రాక్టులు చేస్తున్నారనేది ఇప్పుడు కడప జిల్లాలో బాగా వినిపిస్తున్న మాట.
వైసీపీ నేతలు కాంట్రాక్టులు చేయకుండా, చేసినట్లు అప్పుడు వైసీపీ ప్రభుత్వం హయాంలో బిల్లులు పెడితే.. ఇప్పుడు టీడీపీ వారే పర్సెంటేజ్‌లు తీసుకొని బిల్లులు ఇప్పించారని మీడియాలో కూడా కధనాలు వచ్చాయి. టీడీపీ వారేమో వైసీపీ నేతలతో కుమ్ముక్కు అవుతుంటే.. బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఒక్కరే, జగన్‌తో ఒంటరిగా పోరాడుతున్నారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో బాహాటంగా అధికారం చెలాయించిన ఆ పార్టీ నాయకులే.. ప్రస్తుతం టీడీపీ నేతల సహాయ, సహకారాలతో తెర వెనుకుండి అధికారం చెలాఇస్తున్నారని అధికారులే ఆఫ్ ధి రికార్డుగా కామెంట్‌లు చేస్తున్నారంటే.. అక్కడ పరిస్థితి ఎంత దారుణంగా, ఘోరంగా ఉందో స్పష్టమవుతోంది.
Also Read : ఏపీ పారిశ్రామిక రంగంలో గొప్ప ముందడుగు
నిజానికి ఈ విషయాలన్నీ సీఎం చంద్రబాబుకు తెలియకుండా ఉంటాయా?? మంత్రి రాంప్రసాద్ రెడ్డికి కూడా వైసీపీ నేతలతో సన్నిహిత సంబంధంలు ఉన్నాయన్న విమర్శలు, వ్యాఖ్యలు నిజమైన వైసీపీ వ్యతిరేక టీడీపీ నాయకుల నుంచే బయటకు వచ్చాయి. వైసీపీకి వ్యతిరేకంగా టీడీపీని గెలిపిస్తే.. ఇప్పుడు వారు కూడా వైసీపీతో కుమ్మక్కు అవ్వటంతో, వారిని ఎందుకు గెలిపించామా.. అనీ టీడీపీ అభిమానులు, సానుభూతిపరులు తలలు పట్టుకుంటున్నారట. అన్నీ తెలిసిన సీఎం చంద్రబాబు కూడా వైసీపీతో కుమ్మకైనా టీడీపీ ఎమ్మెల్యేలను, నాయకులనే నమ్ముతున్నారేమో..?

