పని వచ్చిన వాడికి… రాని వాడికి తేడా స్పష్టంగా తెలిసిపోతుంది. ఏపీ ప్రజలు వైఎస్ జగన్‌ను కాదని.. చంద్రబాబు ఎందుకు భారీ మెజారిటీతో గెలిపించారో అందరికీ అర్థమవుతోంది. సంక్షేమ పథకాలు అందజేస్తూనే… అభివృద్ధిని పరుగులు పెట్టించగల సమర్థుడు చంద్రబాబు నాయుడు. ఐదేళ్ల వైసీపీ పాలనలో బటన్ నొక్కుడు తప్ప.. జగన్ చేసిన పని మరొకటి లేదు. కానీ చంద్రబాబు అలా కాదు… ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందాలి అంటారు.. అలాగే ప్రతి ఒక్కరూ స్వయం ఉపాధితో ఆర్థికంగా బలపడాలనేది చంద్రబాబు లక్ష్యం కూడా. పాలన పరంగా చంద్రబాబు పనితీరు ఎలా ఉంటుందో ఇప్పటికే అందరికీ తెలుసు. టెక్నాలజీ అందుబాటులో లేని రోజుల్లోనే అన్ని శాఖలపై పట్టు సాధించారు. అలాగే ఏ శాఖలో ఏం జరుగుతుందో అనే విషయంపై కూడా చంద్రబాబు సునిశిత దృష్టితోనే వ్యవహరించారు. దీని వల్ల ఉద్యోగులు అసహనం వ్యక్తం చేసినప్పటికీ.. ఫైనల్‌గా ప్రజలకు మాత్రం చాలా మంచి జరిగిందనేది వాస్తవం.
Also Read : కేశినేని చూపు బిజెపి వైపు.. ముహూర్తం ఫైనల్..?
2019-24 మధ్య కాలంలో కేవలం తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకునేందుకు మాత్రమే వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రయత్నం చేశారు. అంతే తప్ప పాలనపైన, ప్రభుత్వ శాఖలపైన ఎలాంటి దృష్టి సారించలేదు. పరిపాలనపై పట్టు సాధించలేదనేది అక్షర సత్యం. ఐదేళ్ల వైసీపీ పాలనలో కేవలం కక్ష సాధింపు చర్యలకు, ప్రత్యర్థుల దూషణకు మాత్రమే పెద్ద పీట వేశారు. అలాగే ప్రభుత్వ పథకాల్లో తన పేరు ఉండేందుకు తెగ తాపత్రయ పడ్డారు కూడా. అందుకే దాదాపు 50కి పైగా ప్రభుత్వ పథకాలకు తన పేరే పెట్టుకున్నారు వైఎస్ జగన్. అంతే తప్ప.. పాలన విషయాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారు. వైసీపీ ఘోర పరాజయానికి ఇదే ప్రధాన కారణం.
Also Read : తమ్మినేనికి మ్యూజిక్ స్టార్ట్ అయిందా…?
కానీ చంద్రబాబు స్టైల్ మాత్రం వేరు. పని తీరు బాగుంటే.. పేరు అదే వస్తుందనేది ఆయన విధానం. అందుకే.. ప్రభుత్వంలోని అన్ని శాఖలను స్వయంగా పర్యవేక్షిస్తారు. ఏం జరిగినా వెంటనే తనకు తెలిసేలా చూసుకుంటారు. ఐదేళ్ల పాటు విధ్వంసానికి గురైన రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి పధంలో పెట్టేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నామంటున్నారు చంద్రబాబు. చెప్పడమే కాదు.. చేసి చూపిస్తున్నారు కూడా. 75 ఏళ్ల వయసులో కూడా రోజుకు 16 గంటలు పని చేస్తూ.. బిజీ బిజీగా గడిపేస్తున్నారు. అన్ని శాఖల మంత్రులు, అధికారులతో చర్చిస్తున్నారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, పథకాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ప్రతి రాష్ట్రానికి కేంద్రం నుంచి తప్పనిసరిగా కేటాయింపులు ఉంటాయి. ఇవన్నీ ఆయా ఆర్థిక ఏడాది ముగింపు లోపు సాధించాల్సిందే. లేదంటే మురిగిపోతాయి. ఈ ఆర్థిక ఏడాది మరో వారం రోజుల్లో ముగియనుంది. దీంతో ఆర్థిక అవసరాలు, జీత భత్యాలపై ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో చంద్రబాబు భేటీ అయ్యారు.
Also Read : కడపలో వైసీపీకి షాక్ తప్పదా..?
మార్చి 31వ తేదీ నాటికి మురిగిపోయే నిధులపై చంద్రబాబు దృష్టి పెట్టారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, బకాయిలను తక్షణమే రప్పించుకునేలా చర్యలు తీసుకోవాలని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ను ఆదేశించారు. అవసరమైతే ఢిల్లీ వెళ్లాలని కూడా సూచించారు. ఢిల్లీలోని పార్టీ నేతల సాయంతో నిధులు రాబట్టాలన్నారు చంద్రబాబు. వాస్తవానికి చంద్రబాబు ప్రస్తుతం కేంద్రం నుంచి అప్పు తీసుకోవటం లేదు. న్యాయంగా రాష్ట్రాలకు రావాల్సిన వాటాలను మాత్రమే తీసుకుంటున్నారు. గతంలో వైసీపీ పాలనలో మాత్రం.. ఇలాంటివి ఏవీ జగన్ పట్టించుకోలేదు. తాడేపల్లి ప్యాలెస్ దాటి బయటకు వచ్చిన సందర్భాలు లేవు. సచివాలయం వైపు కేవలం మంత్రివర్గ సమావేశాలప్పుడు మాత్రమే వచ్చేవారు. ఏ స్థాయి అధికారి అయినా సరే.. ప్యాలెస్‌కు వెళ్లాల్సిందే. ఇంకా చెప్పాలంటే… సాయంత్రం 6 తర్వాత ప్యాలెస్ గేట్లు మూసేస్తారు. ఆ తర్వాత ఒకరిద్దరు పార్టీ నేతలకు తప్ప.. ఆ గేట్లు మళ్లీ మరుసటి రోజే తీసేవారు. దీంతో అధికారులంతా ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు వ్యవహరించారు. దీని వల్ల ఆర్థిక ఏడాదిలో కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, గ్రాంట్లు సకాలంలో రాక మురిగిపోయాయి కూడా. ఇదే విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ కూడా వెల్లడించింది. వీటిని రాబట్టి ఉంటే.. రాష్ట్రం ఈరోజు ఇలా అప్పుల పాలయ్యేది కాదు అంటున్నారు ఆర్థిక శాఖ నిపుణులు. కేంద్రం నుంచి రావాల్సిన ప్రతి రూపాయిని సకాలంలో తీసుకుంటే.. అన్ని విధాలుగా మేలు జరుగుతుందనే విషయం చంద్రబాబు తెలిసినట్లుగా జగన్ తెలియదంటున్నారు.




