Wednesday, February 4, 2026 07:31 AM
Wednesday, February 4, 2026 07:31 AM

చరిత్ర మర్చిపోతే ఎలా జగన్..!

తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి.. చేసిన వ్యాఖ్యలు ఒక్కసారి గుర్తు చేసుకుందాం.. పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో నాటి జగన్ ఏలుబడిలో జరిగిన అవినీతి, అరాచకాలను ప్రస్తావించిన పట్టాభి.. ఆవేశంలో బోసిడికే అనేశారు. అంతే.. నిజానికి ఈ మాట బూతు కాదు. కానీ ఇదే సాకుగా చూపించిన వైసీపీ రౌడీ మూకలు ఒక్కసారిగా రెచ్చిపోయాయి. ఏకంగా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి చేశాయి. కార్యాలయంలో సిబ్బందిని తీవ్రంగా కొట్టారు. హత్య చేసేందుకు కూడా తెగబడ్డారు. కార్యాలయం ధ్వంసం చేశారు. గేట్లు విరగగొట్టారు. అద్దాలు పగలగొట్టారు. ఇదంతా పోలీసు సమక్షంలోనే జరిగింది.

Also Read : కామన్ మ్యాన్ కిరణ్ కేనా..? అంబటికి ట్రీట్మెంట్ ఉంటుందా..?

ఇంకా చెప్పాలంటే.. తాడేపల్లి ప్యాలెస్ పెద్దల పర్యవేక్షణలోనే దాడి జరిగింది. ఈ దాడి చేసింది వైసీపీలో కిందిస్థాయి నేతలు, కార్యకర్తలు కాదు.. దేవినేని అవినాష్ వంటి ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసిన వాళ్లు కూడా ఉన్నారు. ఆ తర్వాత మరింత రెచ్చిపోయిన వైసీపీ గూండాలు.. విజయవాడలోని పట్టాభి ఇంటిని ముట్టడించారు. ఇల్లు ధ్వంసం చేశారు. ఆడవాళ్లు, చిన్న పిల్లలు ఒక గదిలో దాక్కున్నారు. నిజంగా ఆ నిమిషంలో వాళ్లు ఆ రౌడీలకు దొరికి ఉంటే.. పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోవడానికే భయమేస్తుంది. ఆ తర్వాత పట్టాభిని అరెస్టు చేసిన పోలీసులు.. కస్టోడియల్ టార్చర్ పెట్టారు. అయితే ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తిని అలా అన్నారు కాబట్టే.. మా వాళ్లు దాడి చేశారు.. అందులో తప్పేముంది అంటూ తాడేపల్లి ప్యాలెస్ పెద్దలు సమర్థించుకున్నారు. అలాంటి వారిలో అంబటి రాంబాబు కూడా ఉన్నారు. సీఎం‌ను తిడితే.. చూస్తూ ఊరుకోవాలా అని కూడా అప్పట్లో రాంబాబు పెద్ద పెద్ద కబుర్లు చెప్పారు.

Also Read : కల్తీ జరిగింది.. కానీ అన్నకు ఎలా తెలుస్తుంది..?

ఇదంతా గతం.. మరి ఇప్పుడు పరిస్థితి… నిజానికి సీఎం జగన్‌పై ఆ వ్యాఖ్యలు చేసింది పార్టీ అధికార ప్రతినిధి మాత్రమే. ఆయన అప్పటి వరకు ప్రభుత్వంలో ఎలాంటి పదవులు నిర్వహించలేదు. కేవలం పార్టీ కార్యకర్త మాత్రమే. మరి అంబటి రాంబాబు.. రెండుసార్లు ఎమ్మెల్యే, ఒకసారి మంత్రిగా పని చేశారు. మరి అలాంటి వ్యక్తి ఎంత హుందాగా ఉండాలి. కానీ.. తనకంటే 25 ఏళ్ల పెద్ద వ్యక్తి, 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి. నాలుగోసారి ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి.. అలాంటి వ్యక్తి గురించి ఎంత మర్యాదగా మాట్లాడాలి.. మరి మంత్రిగా, పార్టీ జిల్లా అధ్యక్షునిగా వ్యవహించే వ్యక్తి మరెంత హుందాగా ఉండాలి. కానీ అంబటి రాంబాబు మాత్రం రెచ్చిపోయారు. ఉచ్చనీచాలు మర్చిపోయారు. నోటికి ఏ మాట వస్తుందో అనే సోయ కూడా లేకుండా నోటికి ఎంత మాట పడితే అంత మాట అనేశారు. ముఖ్యమంత్రిని లం.. భాషలో బూతులు తిట్టారు. రమ్మను నా కొ.. అంటూ.. తనకు ముగ్గురు కూతుళ్లు ఉన్నారనే విషయం కూడా మర్చిపోయారు. ఇంత దారుణంగా మాట్లాడిన మాటలు తాడేపల్లి ప్యాలెస్ పెద్దలకు వినపడలేదా..? అనేదే ఇప్పుడు అసలు ప్రశ్న.

Also Read : చంద్రబాబు ఫిట్నెస్ కు ఫిదా.. వైరల్ అవుతోన్న వీడియో

ఎందుకంటే.. అంబటి రాంబాబు వ్యాఖ్యలపై టీడీపీ నేతలు భగ్గుమన్నారు. ఇల్లు ముట్టడించారు. అంతే కానీ పార్టీ కార్యాలయం జోలికి పోలేదు. జగన్ దిష్టి బొమ్మలు తగులబెట్టలేదు. చంద్రబాబుకు తక్షణమే అంబటి క్షమాపణ చెప్పాలన్నారు. అంబటిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అయినా సరే.. అంబటి మాత్రం.. నేను చంద్రబాబును ఏమనలేదు అంటూ బుకాయించారు. నేను మాట్లాడింది తప్పే.. కానీ చంద్రబాబును అనలేదు అంటూ కవరింగ్ చేసుకునే ప్రయత్నం చేశారు. దీంతో మరింత రెచ్చిపోయిన టీడీపీ కార్యకర్తలు, అభిమానులు ఇంటి మీద దాడి చేశారు. కారు ధ్వంసం చేశారు. అక్కడ ఉన్న పోలీసులు రంగంలోకి దిగి టీడీపీ కార్యకర్తలను చెదరగొట్టారు. ఆ తర్వాత ఎప్పుడో రాత్రికి అంబటి రాంబాబును అదుపులోకి తీసుకున్నారు. మరి ఆయనకు కస్టోడియల్ టార్చర్ ఉంటుందా..? అంటే.. నో అనే సమాధానమే వస్తుంది. ఎంతో మర్యాద పూర్వకంగా.. ఇంకా చెప్పాలంటే.. మీడియా ముందు నల్ల పాలిథిన్ కవర్ కప్పి తీసుకు రాకుండా నేరుగా మెజిస్ట్రేట్ ముందు ప్రవేశం. ఆ తర్వాత అంబటి కోర్టుకు వెళ్లే క్రమంలో గర్వంగా చెయ్యి చూపిస్తూ.. నన్ను ఏం చేయలేరనే నవ్వుతో.. జైలులోకి.

అయినా సరే.. వైసీపీ అధినేత సహా ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు మాత్రం.. అంబటి రాంబాబుకు అండగా.. ఇంకా చెప్పాలంటే.. రాంబాబు నోటి నుంచి వచ్చినవి సూక్తులని, అసలు అవి బూతులే కావన్నట్లు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వ పాలనను అటవీక రాజ్యం అంటున్న వైసీపీ నేతలు.. మరి ఆరోజు పట్టాభి పట్ల వ్యవహరించింది ఏమిటీ.. ఈ రోజు టీడీపీ కార్యకర్తలు అంబటి ఇంటిపై దాడి చేయడం తప్పు అయితే.. ఆ రోజు పట్టాభి ఇంట్లో వైసీపీ రౌడీలు చేసింది కూడా ముమ్మాటికీ తప్పే. ఇంకా చెప్పాలంటే.. వైసీపీ నేతలు టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేశారు.. కానీ టీడీపీ కార్యకర్తలు అలా తాడేపల్లి ప్యాలెస్ వైపు కనీసం కన్నెత్తి కూడా చూడలేదు. అలాంటి ఆలోచన కూడా చేయలేదు. మరి ఎవరి పాలనలో అరాచకం జరిగింది.. ఎవరి పాలన ఆటవిక రాజ్యం.. నాలుగేళ్ల క్రితం జరిగిన విషయాలు కూడా జగన్‌కు గుర్తు లేవా.. అందుకే ఇప్పుడు అందరూ వేస్తున్న ప్రశ్న ఒకటే.. చరిత్ర మర్చిపోతే ఎలా జగన్..!

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?

కూటమి అంటే.. ఒక ఉమ్మడి కుటుంబం...

ఏపీ కేబినేట్ సంచలన...

తిరుమల కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి...

దమ్ముంటే అసెంబ్లీకి రా.....

గత రెండు రోజులుగా తనను ఉద్దేశించి...

బ్రేకింగ్: చంద్రబాబు –...

ఏపీలో ప్రస్తుతం జరుగుతోన్న రాజకీయ పరిణామాలు...

సింఘాల్‌ సరే.. తర్వాత...

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి...

అందరి బ్రతుకు నాకు...

గతవారం పది రోజుల నుంచి ఏపీలో...

పోల్స్