Sunday, March 22, 2026 04:19 AM
Sunday, March 22, 2026 04:19 AM

రప్ప రప్ప ఆపొద్దు.. కార్యకర్తలకు జగన్ సిగ్నల్..!

సాధారణంగా కార్యకర్తలు రేచ్చిపోతూ ఉంటే.. ఉన్మాద చేష్టలు చేస్తూ ఉంటే రాజకీయ పార్టీల అధినేతలు వారిని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఏపీలో మాత్రం సీన్ డిఫరెంట్ గా ఉంటుంది. వైసీపీలో ఎంత ఉన్మాదంగా ప్రవర్తిస్తే అంత గుర్తింపు ఉంటుంది. రెచ్చిపోయే వారికి అధినేత నుంచి స్థానిక నాయకత్వం వరకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఇప్పుడు వైఎస్ జగన్ చేసిన కామెంట్స్, ఆ పార్టీ కార్యకర్తలకు ఇచ్చిన సిగ్నల్ చూసి.. ఆ పార్టీ నేతలే ఆశ్చర్యపోయారు.

Also Read : ఖమ్మంలో టీడీపీ వర్సెస్ వైసీపీ.. ఎందుకిలా..?

గత ఆరు నెలల నుంచి రప్ప రప్ప అనే నినాదంతో చెలరేగిపోతున్నారు. మేక తలలు తెంపినట్టు తెంపుతాం అనే సిగ్నల్ ఇస్తూ ఫ్లెక్సీలు, చేష్టలతో రెచ్చిపోతున్నారు. ఇటీవల జగన్ పుట్టిన రోజు సందర్భంగా కొందరు కార్యకర్తలు చేసిన చేష్టలకు పోలీసులు కూడా అలాగే సమాధానం ఇచ్చారు. ప్రశాంతంగా ఉండే గోదావరి జిల్లాల్లో సైతం ఈ ఉన్మాద చేష్టలు కనిపించాయి. వీటిపై వైసీపీ నేతల్లో కూడా ఆందోళన ఉంది. ఇటువంటి చేష్టలతో ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్తాయనే ఆందోళనను వ్యక్తం చేసారు.

Also Read : వైరస్ తో వణికిపోతున్న అమెరికా.. పిల్లలు జాగ్రత్త..!

అయితే అనూహ్యంగా రప్ప రప్ప అంటూ గోపాలపురం నియోజకవర్గంలో మేకపోతు తల నరికిన కార్యకర్తలను జగన్.. తన ఇంటికి ఆహ్వానించారు. మిమ్మల్ని పోలీసులు అరెస్ట్ చేస్తే మీకు మేము అండగా ఉంటామని, పార్టీ న్యాయ విభాగం అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. దూకుడు కొనసాగించాలి అంటూ కోరారు ఆ కార్యకర్తలను. మీకు ఏ సమస్య వచ్చినా పార్టీ అండగా ఉంటుంది అన్నారు. దీనిపై ఇప్పుడు తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇది పార్టీకి మంచిది కాదని కొందరు నేతలు ఆవేదన వ్యక్తం చేస్తుంటే.. జగన్ వారిని ప్రోత్సహించడం ఆశ్చర్యం కలిగించింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్