ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకునే సంకేతాలు కనబడుతున్నాయి. వైసీపీలో కీలకంగా ఉన్న ఎంపీలు మిథున్ రెడ్డి, అవినాష్ రెడ్డి ఇప్పుడు పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. రాజ్యసభకు అలాగే వైసిపికి విజయసాయిరెడ్డి రాజీనామా చేయడంతో ఇప్పుడు ఢిల్లీలో జగన్ కు ఇబ్బందికర పరిస్తితులు ఎదురయ్యే సంకేతాలు కనపడుతున్నాయి. దీనితో తన ఎంపీలను బిజెపిలోకి పంపించేందుకు జగన్ సిద్ధమవుతున్నట్లు సమాచారం. భవిష్యత్తులో తన కేసుల విషయంలో.. అలాగే తన పార్టీ రాజకీయ మనుగడ విషయంలో ఇబ్బందులు లేకుండా ఉండాలి అంటే జాతీయ పార్టీతో స్నేహం అనేది అత్యంత కీలకం.
Also Read : తండేల్: ఓవర్సీస్ లో వసూళ్ళ పండగ
కాంగ్రెస్ తో అలాగే బీజేపీతో స్నేహం చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం బిజెపికి జగన్ చాలా దూరంగా ఉన్నారు. ఆ పార్టీ అధినాయకత్వం తెలుగుదేశం పార్టీతో అలాగే జనసేన పార్టీతో కలిసి ప్రయాణం చేస్తుంది. కాబట్టి జగన్ ను దగ్గర చేసుకుంటే అనవసరంగా లేనిపోని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. బిజెపిలోకి తన పార్టీ ఎంపీలను పంపించేందుకు జగన్ సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏపీ బీజేపీలో జగన్ కు బీ టీం కూడా ప్రస్తుతం యాక్టివ్ గా లేదు. దీనితో ఆ ఇద్దరు నేతలను పంపి బీజేపీలో పట్టు పెంచుకోవాలని జగన్ భావిస్తున్నట్లు సమాచారం.
Also Read : ఎన్టీఆర్ ను వాడుకోవడానికి రెడీ అయిన దేవరకొండ
వైయస్ వివేకానంద రెడ్డి కేసులో జగన్.. అవినాష్ రెడ్డిని కాపాడేందుకు ఇక ఆయన్ను బిజెపిలోకి పంపించే దిశగా అడుగులు వేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. వివేకానంద రెడ్డి హత్య జరిగిన తర్వాత కుటుంబంలో ఓ సమావేశం జరగగా సమావేశంలో.. సిబిఐ కేస్ పెడితే అవినాష్ బిజెపిలోకి వెళ్తాడని, ఏమవుతుందని జగన్ ప్రశ్నించినట్లు ప్రచారం జరిగింది. ఇప్పుడు అది నిజమయ్యే సూచనలు కనపడుతున్నాయి. ఇక మిథున్ రెడ్డిని అత్యంత ఆప్తుడుగా భావించే జగన్… అతను ఢిల్లీలో పట్టు పెంచుకుంటే తనకు భవిష్యత్తులో ఇబ్బందులు ఉండవని జగన్ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

