ఈ రోజుల్లో దంతాల సమస్య అనేది అతిపెద్దదిగా భావిస్తూ.. ప్రజల్లో ఆందోళన మొదలైంది. దంతాల సమస్య పరిష్కారం కోసం లక్షల రూపాయలు ఖర్చు చేసే వారి సంఖ్య కూడా ఎక్కువే. ఏ పేస్ట్ వాడాలి, ఏ బ్రష్ వాడాలి అంటూ నిపుణులను అడిగే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అదేంటో ఒకసారి చూద్దాం. సాధారణంగా చాలా మంది తెల్ల పేస్ట్ లు ఇష్టపడుతూ ఉంటారు. మనం ఉపయోగించే తెల్ల టూత్ పేస్ట్ ను కాల్షియం కార్బోనేట్ లేదా సిలికా వంటి అబ్రాసివ్ లతో తయారు చేస్తారు. వీటిని దంతాలను స్క్రబ్ చేయడానికి ఉపయోగిస్తారు.
Also Read : బ్రేకింగ్: కొత్త జిల్లాలపై చంద్రబాబు సంచలన నిర్ణయం
దాదాపుగా 200 ఏళ్ళ నుంచి వీటినే వినియోగిస్తూ వస్తున్నారు. కానీ టూత్ పేస్ట్ బ్రాండ్ ఆధారంగా వాడే రసాయనాలు మారే అవకాశం ఉంది. తెల్లటి టూత్ పేస్ట్ లో దంతాలను శుభ్రం చేసే పదార్ధాలు ఒకసారి చూస్తే.. సోడియం ఫ్లోరైడ్సోడియం, సోడియం మోనోఫ్లోరోఫాస్ఫేట్, స్టానస్ ఫ్లోరైడ్. ఇవి కావిటీస్ నుంచి మన దంతాలకు రక్షణ కల్పిస్తాయి. అయితే దీనిలో లౌరిల్ సల్ఫేట్ ఉండటంతో అనారోగ్య సమస్యలు కలిగించే అవకాశం ఉంది. తెల్లటి టూత్‌పేస్ట్ వాడటం వల్ల దంత పరిశుభ్రతకు కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి.
Also Read : బ్రేకింగ్: గోదావరి పుష్కరాల తేదీలు ఇవే.. చంద్రబాబు ఖాతాలో హ్యాట్రిక్ రికార్డ్..!
ఇది దంతాల రక్షిత ఎనామిల్ కు హాని కలిగించే ఫలకాన్ని సమర్థవంతంగా తొలగించడంలో సహాయం చేస్తుంది. అదనంగా, తెల్లటి టూత్ పేస్ట్ కెఫిన్ కలిగిన ఆహారాలు, సిట్రస్ ఆహారాలు, స్వీట్లు తినడం వల్ల ఏర్పడే కొన్ని మరకలను కూడా తొలగిస్తుంది. కొన్ని ఇబ్బందికర పరిణామాలు కూడా ఉన్నాయి. సున్నితంగా ఉండే వారికి ఇది మంచిది కాదు. నోట్లో పుండ్లు సహా అనేక సమస్యలకు కారణం అయ్యే అవకాశం ఉంది. ప్రధానంగా పిల్లలను ప్రభావితం చేసే ఫ్లోరోసిస్ ఇందులో ఉంటుంది. టూత్ పేస్ట్ పిల్లలు మింగితే హాని కలగడం ఖాయంగా చెప్తున్నారు. టూత్ పేస్ట్ లో కింది భాగంలో తయారి కోసం వాడిన పదార్ధాల లిస్టు ఉంటుంది. అవి చదివి పేస్ట్ కొనుక్కోవడం మంచిదట.

