Sunday, March 22, 2026 03:47 AM
Sunday, March 22, 2026 03:47 AM

డైట్ కంటే టైం ముఖ్యమా..? డాక్టర్ సంచలన విషయాలు..!

ఈ రోజుల్లో డైట్ అనే మాట ప్రతీ ఇంట్లో వినపడుతోంది. చేసినా చేయకపోయినా.. హడావుడి మాత్రం పీక్స్ లో ఉంటుంది. కానీ డాక్టర్ల వాదన ప్రకారం డైట్ కంటే కూడా.. ఆహారం సరైన సమయంలో తినడం ముఖ్యం అంటున్నారు వైద్యులు. అసలు ఏ టైం లో తింటే మంచిదో ఒకసారి చూద్దాం. ఎయిమ్స్, హార్వర్డ్ మరియు స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయాలలో ప్రాక్టీస్ చేసిన గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, గట్ డాక్టర్‌ గా ప్రసిద్ధి చెందిన డాక్టర్ సౌరభ్ సేథి తెలిపిన వివరాల ప్రకారం.. పడుకునే కొన్ని గంటల ముందు ఆహారం తింటే మాత్రం శరీరం ఆహారాన్ని సరిగ్గా జీర్ణం చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుందని తెలిపారు.

Also Read : కారు ప్రియులకు కేంద్రం గుడ్ న్యూస్..!

దీని వలన నిద్ర నాణ్యత పెరుగుతుందని, నిండిన పొట్టతో పడుకుంటే ఉండే అసౌకర్యం ఇక్కడ ఉండదు అని తన సోషల్ మీడియా పోస్ట్ లో రాసుకొచ్చారు. మన శరీరంలో అంతర్గతంగా ఓ గడియార వ్యవస్థ ఉంటుందని, జీవక్రియకు అది కీలకమని ఆయన వివరించారు. “మీ డిన్నర్ ప్లేట్ కంటే మీ డిన్నర్ టైం చాలా ముఖ్యం” అని డాక్టర్ సేథి రాసుకొచ్చారు. ఆలస్యంగా తినడం వల్ల ఏమి జరుగుతుందో డాక్టర్ సేథి వివరించారు. ఇన్సులిన్ సెన్సిటివిటీ 50% నుండి 40% వరకు తగ్గుతుంది, కొవ్వు కరగడం నిదానంగా ఉంటుంది. నిద్ర హార్మోన్లు (మెలటోనిన్)పై ప్రభావం పడుతుంది. జీర్ణక్రియ సమయంలో ఇబ్బందులు ఉంటాయి.

Also Read : వైఎస్ అవినాష్‌కు ఎందుకంత ధీమా..?

సూర్యాస్తమయం తర్వాత, మెలటోనిన్ సహజంగా పెరుగుతుంది. ఇన్సులిన్ విడుదల బలహీనపడుతుంది. ఆలస్యంగా రాత్రి భోజనం చేయడం వల్ల నిద్రలేమి, రాత్రిపూట ఎక్కువ కొవ్వు నిల్వ ఉండే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. త్వరగా భోజనం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు చూస్తే.. రాత్రిపూట గ్లూకోజ్ 15% తగ్గుతుంది, మెరుగైన ఇన్సులిన్ సెన్సిటివిటీ, మెరుగైన నిద్ర నాణ్యత, కేలరీల తీసుకోవడం ఒకేలా ఉన్నప్పుడు కూడా పెద్దగా ఇబ్బంది ఉండదట. త్వరగా భోజనం చేయడం వల్ల మంచి నిద్ర వస్తుంది, ఎందుకంటే ఇది పడుకున్నప్పుడు యాసిడ్ రిఫ్లక్స్ లేదా అసౌకర్యం లేకుండా చేస్తుందట.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్