Sunday, March 22, 2026 04:56 AM
Sunday, March 22, 2026 04:56 AM

కేటిఆర్ విచారణ వెనుక కవిత.. బీఆర్ఎస్ సంచలన ఆరోపణ..!

తెలంగాణాలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనంగా మారడం సంగతి పక్కన పెడితే.. ఈ కేసు విషయంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు మాత్రం గులాబీ పార్టీ కార్యకర్తల గుండెల్లో రైళ్ళు పరిగెత్తిస్తున్నాయి. ఈ కేసులో మొన్న మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు విచారించగా నేడు మరో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ ను విచారిస్తున్నారు. ఆ తర్వాత కేసీఆర్ కు నోటీసులు ఇచ్చే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. అరెస్ట్ లు కూడా ఉండే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది.

Also Read : అంతా హరీష్ మాయ.. కేటీఆర్ మసకబారుతున్నారా..?

అయితే బీఆర్ఎస్ కార్యకర్తల వాదన ప్రకారం.. మరో ఆసక్తికర విషయం ఇప్పుడు ప్రచారంలో నడుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసు వెనుక కవిత హస్తం ఉందనే వార్త హల్చల్ చేస్తోంది. మొన్న సుప్రీం కోర్ట్ లైవ్ స్ట్రీమింగ్ ను కవిత వీక్షించారు అంటూ గులాబీ పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ చేస్తున్నారు. మొన్న రేవంత్ రెడ్డిని ఒప్పించి, హైకోర్ట్ తీర్పుపై సుప్రీం కోర్ట్ లో ప్రభుత్వం తరుపున కవిత పిటీషన్ వేయించి ఉండవచ్చు అంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి స్క్రీన్ షాట్ కూడా వైరల్ అవుతోంది.

Also Read : వైసీపీలో పాదయాత్ర ప్రకంపనలు..!

ఫోన్ త్యైంగ్ కేసు లైవ్ ప్రొసీడింగ్స్ లో కవిత లాగిన్ అయ్యారు. ఆమె హస్తం లేకపోతే ఆమె లైవ్ స్ట్రీమింగ్ ఎందుకు వీక్షించారు అంటూ.. బీఆర్ఎస్ కార్యకర్తలు నిలదీస్తున్నారు. ఇక వెబెక్స్ ఐడీలో కవిత తన పేరును కల్వకుంట్ల కవిత కాకుండా.. దేవనపల్లి కవితగా మార్చుకుని హాజరు అయ్యారు అని, పట్టుబట్టి మరీ హరీష్ రావు తర్వాత కేటిఆర్ కు నోటీసులు ఇప్పించారు అంటూ మండిపడుతున్నారు. నేడు కేటిఆర్ విచారణకు హాజరు కావడంతో.. ఆ తర్వాత బాదితురాలిగా కవిత భర్తను విచారణకు పిలిచే అవకాశం కనపడుతోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్