Sunday, March 22, 2026 04:57 AM
Sunday, March 22, 2026 04:57 AM

జట్టుకి భారంగా మారుతున్న జడేజా..?

బ్యాటింగ్ ఆల్ రౌండర్, బౌలింగ్ ఆల్ రౌండర్.. అద్భుతమైన ఫీల్డర్.. ఓవర్సీస్ లో మంచి బ్యాటింగ్ యావరేజ్.. టీం ఇండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా గురించి మాట్లాడితే.. మనం చూసే పొగడ్తలు ఇవి. కానీ ఏడాది కాలంగా జడేజా జట్టుకు భారంగా మారాడు అనే మాట మాత్రం వాస్తవం. భార్య మంత్రి కావడంతోనే అతనికి జట్టులో చోటు ఇచ్చారు, ఇచ్చిన స్థానాన్ని ఆడినా ఆడకపోయినా కాపాడుతున్నారు అనేది.. సగటు క్రికెట్ అభిమానుల్లో ఉన్న అభిప్రాయం. దీనిపై ఎవరెన్ని విమర్శలు చేసినా.. జట్టు యాజమాన్యంలో మాత్రం మార్పు లేదు.

Also Read : భారత జట్టులో ‘ఫేవరిటిజం’: వివాదంలో గంభీర్ నిర్ణయం

బ్యాట్స్మెన్ గా జట్టులోకి వచ్చి.. ధోనీ ఆశీస్సులతో బౌలర్ గా సెటిల్ అయి.. అప్పుడప్పుడు బ్యాట్ తో మెరుపులు మెరిపించాడు. స్వదేశంలో భారత బౌలింగ్ కు బలంగా మారాడు. అశ్విన్ తో కలిసి ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించాడు. కానీ క్రమంగా జడేజా ఆట తీరు ప్రమాణాలు పడిపోతున్నాయి. బెస్ట్ ఫీల్డర్ గా పేరు తెచ్చుకున్న జడేజా.. ఈజీ ఫీల్డింగ్ కూడా వదిలేస్తున్నాడు. వన్డేలలో అతని ఆట తీరు ఏ మాత్రం బాగా లేదు. ఆస్ట్రేలియాలో, మొన్న సౌత్ ఆఫ్రికాతో మూడు వన్డేలలో.. ఇప్పుడు కివీస్ తో దారుణంగా ఫెయిల్ అయ్యాడు.

Also Read : ప్రముఖ ఛానల్ చైర్మన్ తాట తీస్తున్న రేవంత్ సర్కార్..?

పెద్దల సహకారం పుష్కలంగా ఉండటంతో.. జట్టులో ఉంటున్నాడు. నిన్న 44 బంతులు ఆడి.. 60 స్ట్రైక్ రేట్ తో అతను 27 పరుగులు చేసాడు. అందులో ఒక బౌండరీ కూడా. 30 బంతుల వరకు జడేజా బౌండరీ కొట్టలేదు. ఓ వైపు కెఎల్ రాహుల్ పరుగులు వేగంగా చేసే ప్రయత్నం చేస్తున్నా జడేజా మాత్రం స్లో ఇన్నింగ్స్ ఆడాడు. బౌలింగ్ లో కూడా పసలేకపోవడంతో అభిమానులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కీలక సమయాల్లో కూడా అనుభవం ఉన్నా సైతం అతని నుంచి సహకారం లేకపోవడం.. ఆందోళన కలిగిస్తోంది. రోహిత్, అశ్విన్, కోహ్లీ, షమీలను బలవంతంగా జట్టు నుంచి పంపించే ప్రయత్నం చేసిన గంభీర్.. జడేజాకు మాత్రం అండగా నిలుస్తున్నాడు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్