Wednesday, February 4, 2026 09:38 AM
Wednesday, February 4, 2026 09:38 AM

తమిళం నేర్చుకుంటున్న పవన్.. బిగ్ ప్లాన్ తో పొలిటికల్ స్టెప్స్

తమిళనాడు ఎన్నికల్లో ఎలాగైనా సరే గెలవాలని ఎన్డీఏ పట్టుదలగా ఉంది. రాజకీయంగా తమిళనాడులో ఉన్న పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకోవడానికి బిజెపి అధిష్టానం తీవ్రంగా కష్టపడుతోంది. తమిళనాడు బిజెపికి ముందు నుంచి పెద్దగా ఆదరణ లేదు. దీంతో అన్నా డీఎంకే పార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళుతుంది బిజెపి. జయలలిత మరణం తర్వాత ఆ పార్టీకి దగ్గరైన బిజెపి.. పలని స్వామి ముఖ్యమంత్రి అయిన తర్వాత అండగా నిలిచింది. ఇక ఇప్పుడు తమిళ ప్రభుత్వం పై ఉన్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు.. వ్యూహాలు సిద్ధం చేసింది.

Also Read : మెగాస్టార్ విశ్వంభర అసలు వస్తుందా..?

ఇటీవల ముంబై కార్పొరేషన్ ఎన్నికల తర్వాత తమిళనాడు బీజేపీ నేతలలో జోష్ కనబడుతోంది. ముంబైలో తమిళ ప్రజలు ఎక్కువగా ఉండే ప్రాంతంలో.. బిజెపి సత్తా చాటింది. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై నిర్వహించిన ప్రచారానికి మంచి స్పందన వచ్చింది. ఆ జోష్ తో ఇప్పుడు తమిళనాడు బిజెపి మరింత ఉత్సాహంగా ముందుకు కదలనుంది. ఇప్పుడు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారం తీసుకునేందుకు బిజెపి ప్రయత్నం చేస్తోందని సమాచారం. కొంత కాలంగా పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో యాక్టివ్ అయినట్లుగానే కనబడుతున్నారు. విమర్శల విషయంలో గాని పరిపాలన విషయంలో కానీ పట్టు పెంచుకుంటున్నారు పవన్ కళ్యాణ్.

Also Read : బీజేపీకి వైసీపీ ఎంపీ భారీ విరాళం..!

ఇక ఇప్పుడు ఆయనను దక్షిణాది రాష్ట్రాలకు వాడుకోవాలని బిజెపి ఓ ప్రణాళిక సిద్ధం చేసుకుని అడుగులు వేస్తోంది. త్వరలో బహిరంగ సభ నిర్వహించి ఎన్నికల ప్రచారాన్ని షురూ చేయాలని ఎన్డీఏ భావిస్తున్నట్లు సమాచారం. ఎన్నికల నాటికి కనీసం ఏడు బహిరంగ సభలలో పవన్ కళ్యాణ్ పాల్గొనే విధంగా ప్లాన్ చేస్తోంది బిజెపి. చెన్నై, కోయంబత్తూరు, ఈరోడ్ సహా ఏడు జిల్లాల్లో పవన్ కళ్యాణ్ ద్వారా ప్రచారం చేయించాలని ప్లాన్ చేస్తున్నారు. ఇందుకోసం పవన్ కళ్యాణ్ తమిళం కూడా నేర్చుకుంటున్నట్లు సమాచారం. భాషకు ప్రాధాన్యత ఇచ్చే విషయంలో తమిళ ప్రజలు ముందుంటారు. అందుకే పవన్ కళ్యాణ్ తమిళం నేర్చుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ సభలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా హాజరుకానున్నట్లు రాజకీయ వర్గాలు అంటున్నాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?

కూటమి అంటే.. ఒక ఉమ్మడి కుటుంబం...

ఏపీ కేబినేట్ సంచలన...

తిరుమల కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి...

దమ్ముంటే అసెంబ్లీకి రా.....

గత రెండు రోజులుగా తనను ఉద్దేశించి...

బ్రేకింగ్: చంద్రబాబు –...

ఏపీలో ప్రస్తుతం జరుగుతోన్న రాజకీయ పరిణామాలు...

సింఘాల్‌ సరే.. తర్వాత...

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి...

అందరి బ్రతుకు నాకు...

గతవారం పది రోజుల నుంచి ఏపీలో...

పోల్స్