Sunday, March 22, 2026 07:47 AM
Sunday, March 22, 2026 07:47 AM

అజారుద్దీన్ కు పదవీ గండం..? గవర్నర్ షాక్ ఇస్తారా..?

ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా మాజీ క్రికెటర్ అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వటం ఓ సంచలనమైంది. ఆయన విషయంలో కాంగ్రెస్ పార్టీ వేసిన అడుగులు గులాబీ పార్టీని.. నియోజకవర్గంలో గట్టి దెబ్బ కొట్టాయి. 2023 ఎన్నికల్లో జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన అజారుద్దీన్.. ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కొంత సన్నిహితంగా ఉండటంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సమయంలో ఆయనకు సీటు వస్తుందని అందరూ భావించారు. అయితే అనూహ్యంగా నవీన్ యాదవ్ కు సీటు ఖరారు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

Also Read : డ్రగ్స్ కేసులో దొరికిపోయిన స్టార్ హీరోయిన్ తమ్ముడు..?

ఇక అక్కడ నుంచి అజారుద్దీన్ విషయంలో రేవంత్ ఏ న్యాయం చేస్తారా అనే దానిపై పెద్ద చర్చే జరిగింది. కానీ అజారుద్దీన్ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ చేస్తూ.. మంత్రి పదవి ఖరారు చేశారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలోనే అజారుద్దీన్ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ ప్రభావం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై పడింది. అయితే ఇప్పుడు అజరుద్దీన్ కు పదవి గండం ఉంది అనే ప్రచారం జరుగుతుంది. వాస్తవానికి గవర్నర్ కోటలో ఎమ్మెల్సీ పదవీ విషయంలో గతంలో వివాదాలు చెలరేగాయి. దీనితో సుప్రీంకోర్టు కోదండరాం, అలీఖాన్ ల నియామకాలను రద్దు చేసింది. ఇక ఇప్పుడు అజారుద్దీన్ కు ఇచ్చిన మంత్రి పదవి పై గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంటుంది.

Also Read : అన్నీ ఉత్త మాటలే.. మేము సవాల్ చేస్తమంతే..!

ఒకవేళ గవర్నర్ ఆమోదముద్ర వేసినప్పటికీ.. దీనిపై కోర్టుకు వెళ్లేందుకు ప్రతిపక్ష బీఆర్ఎస్ సిద్ధంగా ఉంది. వాస్తవానికి మంత్రిగా బాధ్యతలు చేపట్టాలి అంటే చట్టసభల్లో ఏదో ఒక దానికి ఎన్నిక కావాల్సి ఉంటుంది. అజరుద్దీన్ ఇప్పుడు అధికారికంగా ఎమ్మెల్సీ కాకపోవడంతో.. వచ్చేయడాది ఏప్రిల్ లోపు ఆయన ఎన్నిక కావాల్సి ఉంటుంది. లేదంటే వచ్చే ఏడాది నవంబర్ వరకు ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ స్థానం కోసం ఆయన ఎదురు చూడక తప్పదు. ఈలోపు రాజ్యాంగ బద్ధంగా ఉన్న సమయ గడువు పూర్తయిపోతుంది. కాబట్టి అజారుద్దీన్ రాజీనామా చేయక తప్పదు. మరి దీనిపై సీఎం రేవంత్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లాలని భావిస్తున్న ఓ ఎమ్మెల్సీ.. తన పదవికి రాజీనామా చేసి ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఒకవేళ గవర్నర్ ఆమోద ముద్ర వేయకపోతే ఆ పదవికి అజారుద్దీన్ ను రేవంత్ ఎంపిక చేసే అవకాశం కనబడుతోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్