Friday, March 20, 2026 07:36 PM
Friday, March 20, 2026 07:36 PM

ఒక్క దెబ్బకు అమెరికా పరువు తీసిన ఇరాన్..!

ఇరాన్ – ఇజ్రాయిల్, అమెరికా దేశాల మధ్య మొన్నటి వరకు జరిగిన యుద్ధం ఒక ఎత్తు.. నిన్న జరిగిన పరిణామం ఒక ఎత్తు. అమెరికాకు చెందిన ఎఫ్ – 35 విమానాన్ని ఇరాన్ కూల్చివేసింది. ఇదే ఇప్పుడు ప్రపంచాన్ని షాక్ కు గురి చేసింది. సాధారణంగా ఎఫ్ – 35 విమానాలు రాడార్లకు దొరకవు. మరి ఇరాన్ ఎలా కూల్చింది..? ఇరాన్ తన రక్షణ వ్యవస్థలో రష్యాకు చెందిన ఏ-400 లాంటి అధునాతన రాడార్లను, స్వదేశీ ‘రెజోనన్స్-NE’ రాడార్లను వాడుతోంది. ఇవి అతి తక్కువ ఫ్రీక్వెన్సీలో పనిచేస్తూ, స్టెల్త్ విమానాలు గాలిలో కలిగించే చిన్నపాటి అలజడిని కూడా పట్టుకోగలవు.

Also Read : భారత్ లో గ్యాస్ కొరత తీవ్రం కానుందా..?

అలా ఎఫ్ – 35 ఎక్కడ ఉందో ఇరాన్ గుర్తించగలిగింది. ఇరాన్ దగ్గర 358 అనే ఒక వింత క్షిపణి ఉంది. ఇది గాలిలో ఒక డ్రోన్ లాగా తిరుగుతూ, శత్రు విమానం ఎప్పుడు కనిపిస్తుందా అని వేచి చూస్తుంది. అలా ఎఫ్-35 వేగాన్ని, దాని ఇంజిన్ నుంచి వచ్చే వేడిని పట్టుకుని ఈ మిస్సైల్ నేరుగా వెళ్లి ఢీకొట్టింది. అమెరికా విమానంలోని సెన్సార్లు, కమ్యూనికేషన్ వ్యవస్థను ఇరాన్ తన శక్తివంతమైన జామింగ్ పరికరాలతో స్తంభింపజేసింది. దీనివల్ల పైలట్ ఆ విమానాన్ని నియంత్రించలేకపోయాడు, అదే సమయంలో ఇరాన్ క్షిపణులు విరుచుకుపడ్డాయి.

Also Read : హార్మూజ్ జలసంధి ఓపెన్ అవుతుందా..?

ఇరాన్ ప్రయోగించిన క్షిపణి ధాటికి.. విమానంలోని ఒక ఇంజిన్ భాగాన్ని, తోక భాగాన్ని తీవ్రంగా దెబ్బతిన్నది. విమానం కూలిపోయే స్థితికి రావడంతో, పైలట్ అత్యవసరంగా పక్కనే ఉన్న బేస్‌ లో ల్యాండ్ చేయడానికి ప్రయత్నించాడు. అయితే విమానం దాదాపు పనికిరాకుండా పోయింది. ఒక్క ఎఫ్ – 35 శత్రువుల చేతికి చిక్కినా, అందులోని రహస్య సాంకేతికత బయటపడిపోతుంది. ఒక్కో ఎఫ్ – 35 విమానం ఖరీదు సుమారు 100 మిలియన్ డాలర్లు మన కరెన్సీలో సుమారు 830 కోట్ల రూపాయలు. ఇలాంటి విమానం ఒక సాధారణ క్షిపణితో కూల్చి, అమెరికా ఆత్మవిశ్వాసాన్ని ఇరాన్ దెబ్బతీసింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

ఆస్తుల నిజం జగన్...

గత నాలుగేళ్ల నుంచి వైఎస్ కుటుంబంలో...

మదనపల్లె దహనం కేసులో...

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన...

తగ్గని పిన్నెల్లి వాయిస్.....

పల్నాడు రాజకీయాల్లో అత్యంత వివాదాస్పదమైన గుండ్లపాడు...

ఆళ్ల ప్లాన్ రివర్స్.....

అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారంలో గత...

పోల్స్