Sunday, March 22, 2026 01:16 PM
Sunday, March 22, 2026 01:16 PM

విమానయాన శాఖలో లోపం ఎవరిది?

భారత పౌర విమానయాన రంగంలో ఏమి జరుగుతోంది? గత మూడు నెలలుగా వరుస ఘటనలు చోటుచేసుకోవడంతో ఈ ప్రశ్న దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అహ్మదాబాద్ విమాన ప్రమాదం, జీపీఎస్‌ స్పూఫింగ్ ఘటనలు, బాంబు బెదిరింపులు… ఇప్పుడు ఇండిగో విమానాల రద్దుపై వెలుగులోకి వస్తున్న అంశాలు విమానయాన రంగాన్ని మొత్తం రంగాన్ని కుదిపేశాయి.

Also Read : చంద్రబాబు ఎందుకు ఈజీ టార్గెట్ అవుతున్నారు?

భారతదేశంలో అతిపెద్ద విమానయాన సంస్థ అయిన ఇండిగోకు నవంబర్ నెల తీవ్ర ఒత్తిడిగా మారింది. ప్రభుత్వం విడుదల చేసిన వివరాల ప్రకారం ఒక్క నవంబర్ నెలలోనే ఇండిగో 1,232 విమానాలు రద్దు చేయాల్సి వచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం భారతీయ విమానాల రద్దులో 62% ఇండిగో వాటానే. ప్రధానంగా సిబ్బంది చేసిన తప్పిదాలు, షెడ్యూల్ నిర్వహణలో లోపాలే ఈ పరిస్థితికి కారణమని విమానాయాన శాఖ గుర్తించింది. దీంతో ఇండిగోలోనే సుమారు 755 విమానాలు రద్దు అయ్యాయి.

మరోవైపు, ఇతర విమానయాన సంస్థల పరిస్థితి కూడా పెద్దగా భిన్నంగా లేదనే విషయం డాటా స్పష్టంగా చెబుతోంది. ముఖ్యంగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సమస్యలు, గాలి మార్గాల్లో పెరిగిన ట్రాఫిక్‌ కారణంగా అనేక విమానాలు ఆలస్యమయ్యాయి లేదా రద్దయ్యాయి. ఈ పరిస్థితుల్లో లక్షలాది మంది ప్రయాణికులు గంటల తరబడి విమానాశ్రయాల్లో వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Also Read : జగన్ రెడ్డి.. నోరు అదుపులో పెట్టుకో.. టీడీపీ వార్నింగ్..!

డీజీసీఏ విడుదల చేసిన అక్టోబర్ డేటా ప్రకారం, విమానాల రద్దుకు ప్రధాన కారణాల శాతం ఇలా ఉంది:

  • సాంకేతిక లోపాలు – 38.7%

  • వాతావరణ సమస్యలు – 17.7%

  • టైమింగ్ మరియు షెడ్యూలింగ్ ఇష్యూస్ – 15.4%

  • మిగతా రద్దులు ఇతర కారణాల వల్ల చోటుచేసుకున్నాయి.

ఈ వరుస సమస్యలతో పౌర విమానాయాన శాఖపై అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. గతంలో ఎప్పుడూ లేని రీతిలో సమస్యలు చోటుచేసుకోవడంతో కేంద్ర ప్రభుత్వం కూడా ఒత్తిడిలో పడింది. ఉన్నతాధికారుల వైఫల్యం, విభాగాల మధ్య సమన్వయ లోపం, మౌలిక వసతులలో బలహీనతలే ప్రస్తుత పరిస్థితికి ప్రధాన కారణాలుగా పరిశ్రమ నిపుణులు పేర్కొంటున్నారు. ఇదే సందర్భంలో విమానాయాన శాఖా మంత్రికి శాఖపై సరైన పట్టు లేదన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్