ఇండియన్ సినిమా పరిశ్రమలో డైమండ్ స్పూన్ వారసులకు కొదవ లేదు అనే మాట వాస్తవం. మన తెలుగుతో సహా అన్ని భాషల్లో కోట్ల రూపాయల ఆస్తులకు వారసులు ఉన్నారు. ఈ జాబితాలో ముందు ఉండే నటుడు హృతిక్ రోషన్. వేల కోట్ల రూపాయల ఆస్తులు కలిగి ఉన్న ఈ బాలీవుడ్ సీనియర్ హీరో.. ఆస్తుల విలువ తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వడమే. బాలీవుడ్ లో టాప్ 5 రిచ్ యాక్టర్స్ లో ఒకడిగా నిలిచాడు ఈ స్టార్ నటుడు. జీక్యూ ఇండియా నివేదిక ప్రకారం.. ఈ స్టార్ యాక్టర్ నికర ఆస్తుల విలువ దాదాపు రూ. 3,100 కోట్లు.
Also Read : పీక్స్ కు ఫ్యాన్స్ వార్.. రగిలిపోతున్న రెబల్ ఫ్యాన్స్..!
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, సినిమాల్లో చేయడమే కాకుండా వ్యాపార రంగంలో కూడా సత్తా చాటాడు. దాదాపు వెయ్యి కోట్లకు పైగా వ్యాపారాలు అతని ఆధీనంలో ఉండటం గమనార్హం. ముంబైలో అతని ఖరీదైన ఇల్లు ఓ సంచలనం. రూ. 100 కోట్ల విలువ చేసే ఇల్లు ముంబైలో ఉండటం గమనార్హం. బీచ్ కు ఎదురుగా ఉన్న జూహూ ప్రాంతంలో మూడు అంతస్థులలో ఇంటిని కట్టుకున్నాడు. ది నో బ్రోకర్ టైమ్స్ ప్రకారం దీని విలువ దాదాపు రూ.100 కోట్లు.
Also Read : భూములను లాక్కోలేరు… రికార్డులు తారుమారు చేయలేరు
38,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ఇల్లు ఉంటుంది. హృతిక్ రోషన్ కు రూ. 33 కోట్లు విలువ చేసే లోనావాలా ఫామ్‌హౌస్ కూడా ఉంది. ముంబై నుంచి వెళ్ళినప్పుడు ఎక్కువగా అతను అక్కడే ఉంటాడు. 200 కోట్ల రూపాయలు విలువ చేసే హెచ్ ఆర్ఎక్స్ దుస్తుల బ్రాండ్ అతని సొంతం. ఇక సినిమాల రెమ్యునరేషన్ కూడా భారీగా తీసుకుంటాడు. ఇటీవల అతను నటించిన వార్ 2 సినిమాకు 48 కోట్ల రూపాయలు తీసుకున్నాడు. ఇక సోషల్ మీడియాలో పోస్ట్ ల కోసం దాదాపు 4 నుంచి 5 కోట్ల వరకు వసూలు చేస్తూ ఉంటాడు. హ్రితిక్ రోషన్ కు సినిమా నిర్మాణ సంస్థ కూడా ఉన్న సంగతి తెలిసిందే. హెచ్ ఆర్ ఎక్స్ ఫిలిమ్స్ నిర్మాణ సంస్థను నడుపుతున్నాడు.

