Sunday, March 22, 2026 11:35 AM
Sunday, March 22, 2026 11:35 AM

చేతులు మారుతున్న ఆర్సీబీ..!

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. 2008లో మొదలైన ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ ట్రోఫీతో ఆర్సీబీ ప్రయాణం మొదలైంది. నాటి నుంటి నేటి వరకు ఆర్సీబీకి ఖాతాలో ఎన్నో రికార్డులు. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం సొంత గ్రౌండ్‌గా సాగుతున్న ఆర్సీబీ తొలిసారిగా 2025 ఐపీఎల్ ట్రోఫీ గెలుచుకుని.. తన ట్రోఫీ దాహాన్ని తీర్చుకుంది. 10 సార్లు ప్లే ఆఫ్ వరకు వెళ్లిన ఆర్సీబీ.. 2009, 2011, 2016లో రన్నరప్‌గా నిలిచింది. ఇక ఆర్సీబీ చుట్టూ ఎన్నో వివాదాలు కూడా ఉన్నాయి. తీవ్ర ఆర్థిక నేరాలకు పాల్పడినట్లు ఆరోపణలున్న పారిశ్రామిక వేత్త విజయ్ మాల్యా సారధ్యంలోని యునైటెడ్ స్పిరిట్స్ సంస్థ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును ఏకంగా 111.6 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. ఇది రెండో అతిపెద్ద వేలం ప్రక్రియ. ముంబై ఇండియన్స్ జట్టును రిలయన్స్ సంస్థ 111.9 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. ఇక ఆటగాళ్ల కోసం నిర్వహించిన వేలం కూడా రికార్డు స్థాయి ధరతో కీలక ఆటగాళ్లను ఆర్సీబీ సొంతం చేసుకుంది.

Also Read : తిరుమల శ్రీవారి భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం

2008లో మొదలైన ఆర్సీబీ ప్రస్తానం ఇప్పటికీ కొనసాగుతోంది. కుంబ్లే, కోహ్లీ వంటి సీనియర్ క్రికెటర్ల సారధ్యంలో ఆర్సీబీకి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. మిగిలిన జట్లపై వివాదాలు వచ్చినప్పటికీ.. ఆర్సీబీ మాత్రం వాటికి దూరంగా ఉందనేది క్రీడా విశ్లేషకుల మాట. రీబోక్, అడిడాస్, జివెన్, పుమా, ఖతార్ ఎయిర్‌వేస్ వంటి అంతర్జాతీయ సంస్థలు ఆర్సీబీ స్పాన్సర్లు. వీటితో పాటు కింగ్ ఫిషర్, మెక్ డొవెల్, రాయల్ ఛాలెంజ్, హీరో సైకిల్స్, ముత్తూట్ ఫిన్ కార్ప్ వంటి దేశీయ సంస్థలు కూడా చాలా కాలంగా ఆర్సీబీ వెంటే ఉన్నాయి. విజయ్ మాల్యాపై నేరారోపణలు వెల్లువెత్తిన తర్వాత ఆర్సీబీ మనుగడపై కూడా నీలి నీడలు కమ్ముకున్నాయి. కానీ జట్టు యాజమాన్యం మాత్రం.. ఎలాంటి ఒడిదుడుకులకు లోనుకాలేదు. అటు ప్లేయర్స్ విషయంలో, ఇటు అభిమానులు, స్పాన్సర్ల విషయంలో చాలా జాగ్రత్తగానే వ్యవహరించింది.

Also Read : నాకే ఫోన్ చేయండి.. మాలేపాటి కుటుంబానికి లోకేష్ ఇచ్చిన హామీ ఏంటీ..? 

ప్రస్తుతం ఆర్సీబీ చేతులు మారుతోందనే మాట క్రికెట్ వర్గాలతో పాటు సినీ రంగంలో కూడా హాట్ ‌టాపిక్‌గా మారింది. 2024 సీజన్ ముగిసే నాటికి ఆర్సీబీ బ్రాండ్ వాల్యూ 117 మిలయన్ల డాలర్లు. ప్రస్తుతమున్న జట్లలోనే మోస్ట్ వ్యాల్యుబుల్ ఫ్రాంచెజీగా గుర్తింపు తెచ్చుకుంది. ఇక 2025 ఐపీఎల్ టైటిల్ గెలిచిన తర్వాత ఆర్సీబీ వ్యాల్యూ మరింత పెరిగినట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో దీనిని సొంతం చేసుకునేందుకు బడా సంస్థలు క్యూ కట్టాయి. 17 ఏళ్లుగా యునైటెడ్ స్పిరిట్స్ చేతుల్లోనే ఉన్న ఆర్సీబీని సినీ దిగ్గజ సంస్థ హోంబలే ఫిలిమ్స్ సంస్థ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. రాబోయే సీజన్ నుంచే ఆర్సీబీని హోంబలే నిర్వహిస్తుందని ఇప్పుడు అటు శాండిల్ వుడ్‌తో పాటు క్రికెట్ లవర్స్ కూడా చెబుతున్నారు. తాజాగా ఆర్సీబీ జెర్సీతో సలార్ టీమ్ ఫోటోలకు ఫోజులివ్వడంతో ఇక నుంచి హోంబలే ఆర్సీబీ అని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. బెంగళూరు టీమ్ పేరును హోంబలే ఫిలిమ్స్ కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అనే పేరుతోనే నిర్వహిస్తుందంటున్నారు. మరి ఆర్సీబీని హోంబలే సొంతం చేసుకుందా అనే విషయం అధికారికంగా తెలియాలంటే.. మరికొంత కాలం ఆగాల్సిందే.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్