Sunday, March 22, 2026 10:11 AM
Sunday, March 22, 2026 10:11 AM

హిడ్మాకు సోషల్ మీడియాలో షాకింగ్ క్రేజ్.. వైరల్ అవుతోన్న తల్లి దీన స్థితి..!

దాదాపు 60 ఏళ్ల నుంచి కొనసాగుతున్న భారతదేశ విప్లవ ఉద్యమానికి ఎలాగైనా సరే, ముగింపు పలకాలని పట్టుదలగా అడుగులు వేస్తున్న కేంద్ర హోంశాఖ, ఇటీవల కాలంలో చేసిన ఎన్కౌంటర్లపై తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటుంది. ఎలాగైనా సరే మావోయిస్టులను అంతం చేయాలని అడుగులు వేస్తున్న బలగాలు ఇటీవల కాలంలో.. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మాడ్వి హిడ్మాను కాల్చి చంపాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మారేడుమిల్లి అడవుల్లో, గ్రేహౌండ్స్ బలగాలు జరిపిన ఎన్కౌంటర్ లో అతను ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు ప్రకటించారు. ఇప్పుడు ఇక్కడి నుంచే మావోయిస్టు పార్టీపై సానుభూతి పెరుగుతోంది అంటున్నారు పరిశీలకులు.

Also Read : పదవ తరగతి పరీక్షలు షెడ్యూల్ విడుదల..!

ఇటీవల చతిస్గడ్ హోం మంత్రి.. హిడ్మా తల్లిని కలిశారు. ఆ సందర్భంగా బయటికి వచ్చిన వీడియోలు పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. తన కొడుకు లొంగిపోవాలని ఆమె ఆ వీడియో కూడా విడుదల చేశారు. అది జరిగిన వారం రోజుల్లోనే.. హిడ్మాను బలగాలు కాల్చి చంపాయి. హిడ్మా మరణ వార్త బయటకు వచ్చిన తర్వాత.. అతని తల్లికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దండకారణ్యంలో ఉన్న కొంతమంది జర్నలిస్టులు ఆమెను సంప్రదించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా తీసిన వీడియోలను జర్నలిస్టులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఆ వీడియోలో ఆమెకు కనీసం కట్టుకోవడానికి చీర కూడా లేకపోవడం చూసి చాలామంది చలించి పోయారు. కొడుకును చూడటానికి ఆమె అంత్యక్రియల ప్రదేశానికి వెళ్ళిన సమయంలో.. కనీసం కాళ్లకు చెప్పులు కూడా లేకపోవడం చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. ఓవైపు మావోయిస్టులను దేశద్రోహులుగా, తీవ్రవాదులుగా, దోపిడీదారులుగా చూపిస్తున్న సమయంలో.. హిడ్మా తల్లి పరిస్థితి చూసిన చాలామంది.. తమ అభిప్రాయాలను మార్చుకొని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. హిడ్మాకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. కావాలనే ఓవర్గం మీడియా అతనిని రాక్షసుడుగా చూపించిందని మరికొంతమంది మండిపడుతున్నారు.

Also Read : టీడీపీ – వైసీపీ మధ్య విమానాల గోల..!

మావోయిస్టులు దేశద్రోహులు, దోపిడీదారులు అయితే అతని తల్లి పరిస్థితి అలా ఎందుకు ఉంటుందని.. అతను దళ కమాండర్ కూడా కాదని, సెంట్రల్ కమిటీ సభ్యుడు అని.. దశాబ్దాల పాటు విప్లవంలో కీలక పాత్ర పోషించిన.. అతను చివరికి తన భార్యను కూడా తనతో పాటే తీసుకు వెళ్లిపోయాడు అంటూ.. కీర్తిస్తున్నారు. మావోయిస్టు ఉద్యమంలో ఎక్కువగా తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే కేంద్ర కమిటీలో ఉంటారు. చతిస్గడ్ గిరిజన ప్రాంతం నుంచి కేంద్ర కమిటీలోకి వెళ్లిన ఒకే ఒక్కడు అతను. అతని కోసం కేంద్ర హోంశాఖ దేశంలోనే అత్యున్నత నిఘా వ్యవస్థను రంగంలోకి దించింది. అంతటి ప్రభావం చూపించిన హిడ్మా, కనీసం తన తల్లిని కూడా సరిగా చూసుకోలేకపోయాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చాలామంది. ఇక అతనిని పట్టుకుని కాల్చి చంపారని, మావోయిస్టు పార్టీ చేసిన ప్రకటన తర్వాత, మరింత సానుభూతి పెరిగింది. మావోయిస్టులు హింస చేస్తున్నారని విమర్శిస్తున్నప్పుడు.. బలగాలు గిరిజన గూడెంలో చేస్తున్న మారణకాండ గురించి ఏం చెప్తారు అని నిలదీస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్