Sunday, March 22, 2026 02:00 AM
Sunday, March 22, 2026 02:00 AM

జిల్లా ఏర్పాటు సరే.. మరి వాటి సంగతి..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా సంఖ్య 28కి చేరింది. కొత్తగా మార్కాపురం, పోలవరం జిల్లాలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో ఇప్పటి వరకు 26గా ఉన్న జిల్లా సంఖ్య ఇక నుంచి 28కి చేరింది. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. ఇక్కడే అసలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పరిపాలన సౌలభ్యం కోసం జిల్లాల సంఖ్య పెంచారు.. అంత వరకు బాగానే ఉన్నప్పటికీ.. ఆయా జిల్లాల్లో మౌలిక వసతుల కల్పన పరిస్థితి ఏమిటనే ప్రశ్న ఇప్పుడు వినిపిస్తోంది. 2019 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేవలం 13 జిల్లాలు మాత్రమే ఉన్నాయి. వాటిని వైసీపీ సర్కార్ 26కు పెంచింది. పార్లమెంట్ నియోజకవర్గాలను ప్రాతిపదికగా 13 నుంచి 26 జిల్లాలకు పెంచారు. అయితే ఆ సమయంలో కొన్ని ప్రాంతాల్లో తీవ్ర వ్యతిరేకత రావడం.. కొత్త జిల్లాల ఏర్పాటుతో కొన్ని ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు గుర్తించిన కూటమి ప్రభుత్వం.. కొత్త జిల్లాల ఏర్పాటుతో పాటు రెవెన్యూ డివిజన్లు, మండలాలను ఏర్పాటు చేసింది. అలాగే కొన్ని జిల్లాల సరిహద్దులు కూడా మారుస్తున్నట్లు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

Also Read : మెడికల్ కాలేజీలపై చంద్రబాబు ఒంటరి అయ్యారా..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణ, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, కర్నూలు, కడప జిల్లాలు ఇప్పుడు 28 జిల్లాలుగా మారాయి. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలతో పాటు తాజాగా మార్కాపురం, రంపచోడవరం కేంద్రంగా మార్కాపురం, పోలవరం జిల్లాలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇంత వరకు బాగానే ఉన్నా.. కొత్త జిల్లాల్లో మౌలిక వసతుల కల్పన ఇప్పుడ ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. నిజానికి ఇప్పటి వరకు చాలా జిల్లాల్లో సరైన మౌలిక వసతులు లేవనేది వాస్తవం.

ప్రతి జిల్లాలో కలెక్టరేట్‌తో పాటు జిల్లా పోలీస్ ఎస్పీ కార్యాలయం, జిల్లా పరిషత్, ఇతర జిల్లా స్థాయి అధికారుల కార్యాలయాలు ఉంటాయి. వీటిల్లో చాలా చోట్ల బ్రిటిష్ కాలం నాటి భవనాల్లోనే ఇప్పటికీ కలెక్టర్ కార్యాలయాలు కొనసాగుతున్నాయి. చాలా వరకు శిథిలావస్థకు చేరుకున్న భవనాలు కూడా ఉన్నాయి. వీటి స్థానంలో కొత్తవి నిర్మించాలనే ప్రతిపాదన ఏళ్ల తరబడి వినిపిస్తోంది కూడా. పాత భవనాలను పూర్తిగా పడేసి.. కొత్తగా ఇంటిగ్రేటెడ్ భవనాలు నిర్మించాలని దాదాపు 20 ఏళ్ల క్రితమే నిర్ణయించారు. అయితే ఇవి కేవలం ప్రకటనల స్థాయిలోనే ఆగిపోయాయి. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఒకే చోట ఉండాలనే లక్ష్యంతో ఇంటిగ్రేటెడ్ భవనాలు నిర్మించాలని 1999 నాటి చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించింది. ఆ తర్వాత 2004లో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ ప్రభుత్వం.. కొన్ని జిల్లాల్లో భవనాలకు శంకుస్థాపనలు కూడా చేసింది. కానీ ఆ తర్వాత అడుగు ముందుకు పడలేదు.

Also Read : షమీకి బిగ్ షాక్..? ఎందుకింత కక్ష..?

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు చెందిన కలెక్టరేట్‌ భవనంలో రూ.450 కోట్లతో ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ నిర్మించేందుకు 2008లోనే అప్పటి మంత్రి ధర్మాన ప్రసాదరావు శంకుస్థాపన కూడా చేశారు. కానీ అది పునాది రాయి కూడా ఇప్పటి వరకు పడలేదు. ఇప్పటికీ పాత భవనంలోనే శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయం కొనసాగుతోంది. ఇక ఐదేళ్ల క్రితం కొత్త ఏర్పాటైన జిల్లాల ప్రధాన కార్యాలయాలు ఇప్పటికీ అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని టీటీడీ భవనాల్లో ఏర్పాటు చేశారు. అలాగే ఎన్టీఆర్ జిల్లా కార్యాలయాన్ని విజయవాడలో బ్రిటిష్ కాలం నాటి సబ్ కలెక్టర్ కార్యాలయంలో కొనసాగిస్తున్నారు. కొత్తగా ఏర్పాటు చేస్తున్న మార్కాపురం జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని కూడా పట్టుపరిశ్రమ శాఖకు చెందిన కార్యాలయంలో తాత్కాలికంగా ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఇప్పట్లో భవనాల నిర్మాణం లేనట్లే అని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. తాజా అంచనాల ప్రకారం.. కలెక్టరేట్, ఎస్పీ, జిల్లా పరిషత్ సహా ఇతర ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఒకే చోట ఉండేలా ఇంటిగ్రేటేడ్ భవనాలు నిర్మించాలంటే.. ప్రస్తుత పరిస్థితుల్లో ఒక్కో భవనానికి రూ.800 నుంచి రూ.వెయ్యి కోట్ల వరకు ఖర్చు అవుతుంది. అలాగే వీటిలో మౌలిక వసతుల కల్పనతో పాటు ఫర్నీచర్ కోసం మరో రూ.100 కోట్ల వరకు ఖర్చు చేయాలి. ప్రస్తుతం ప్రభుత్వం ఆ స్థాయిలో ఖర్చు చేసే పరిస్థితుల్లో లేదు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. కాబట్టి.. ఇప్పటి మాదిరిగానే అద్దె భవనాల్లోనే కొనసాగించనున్నారు. కొత్త భవనాలు నిర్మిస్తే.. ఆ చుట్టుపక్కల భూముల విలువ పెరుగుతుంది. ప్రభుుత్వానికి ఆదాయం కూడా వస్తుంది. కానీ ఇలా అద్దె భవనాల్లో ఏర్పాటు వల్ల జిల్లా ఏర్పాటు చేశామనే గొప్ప తప్ప.. పెద్దగా ఉపయోగం మాత్రం ఉండదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్