Monday, October 27, 2025 08:46 PM
Monday, October 27, 2025 08:46 PM
roots

వివేకా కేసుపై అవినాష్ కామెంట్స్.. టీడీపీ ఎమ్మెల్యే సెన్సేషనల్ పోస్ట్

మాజీ మంత్రి వైఎస్ వివేకా కేసు విషయంలో మనం గత ఆరేళ్లుగా ఎన్నో సీన్స్ చూస్తూ వస్తున్నాం. ఈ కేసులో దోషులు ఎవరో తెలిసినా.. వారిని ఇప్పటి వరకు అరెస్ట్ చేయకపోవడం, సిబిఐ అరెస్ట్ చేసే వరకు వెళ్ళినా అడ్డుకోవడం వంటివి ఆశ్చర్యం కలిగించిన అంశాలు. కడప ఎంపీ అవినాష్ రెడ్డి విషయంలో ఎన్నో విమర్శలు ఉన్నాయి ఈ కేసులో. ఆయనే నిందితుడు అనేది కడప జిల్లాలో కూడా జరిగే చర్చ. ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Also Read : తెలుగు బిగ్ బాస్ రెమ్యునరేషన్ ఓ సెన్సేషన్.. ఎన్ని కోట్లంటే..?

కానీ అవినాష్ రెడ్డిని మాత్రం ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదు. ఇక తాజాగా ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.. టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తన సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్ట్ చేసారు. ఆ పోస్ట్ ప్రకారం.. కడప జిల్లా పరిషత్ ఉప ఎన్నిక సందర్భంగా హడావుడి చేసే నాయకులను ముందస్తు అరెస్ట్ లు చేస్తున్న సమయంలో.. ఎంపీ అవినాష్ రెడ్డి ఓ విషయాన్ని బయటపెట్టారట. అవినాష్ రెడ్డి అరెస్ట్ లో ఆసక్తికర పరిణామం అంటూ బుచ్చయ్య పోస్ట్ చేసారు.

https://x.com/GORANTLA_BC/status/1955114151262687717

“పులివెందులలో జెడిపీటీసీ ఎన్నికల నేపధ్యంలో, శాంతి భద్రతల ముందుస్తు చర్యల్లో భాగంగా, టిడిపి, వైసీపీ నేతలని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో తెల్లవారు జామున అవినాష్ రెడ్డి ఇంటికి వెళ్ళిన పోలీసులు, అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసారు. తనని వివేకా కేసులో అరెస్ట్ చేస్తున్నారు అనుకుని అవినాష్ రెడ్డి ఎదురు తిరిగాడు.. ఒకానొక సందర్భంలో జీప్ ఎక్కే ముందు పోలీసుల కాళ్ళు పట్టుకుని, నాకు ఏమీ తెలియదు, నేను జగన్, భారతీ చెప్పినట్టే చేసాను అంటూ, వివేకా కేసు విషయాలు పోలీసులకు చెప్పేశాడు.

Also Read : ఏపీ ఫ్యూచర్ సీఎంపై క్లారిటీ..!

అయితే పోలీసులు ఈ కేసులో మిమ్మల్ని అరెస్ట్ చేయటం లేదు, ఈ కేసుకి సంబంధించి మీకు ఏమైనా ఉంటే సిబిఐకి చెప్పుకోండి అంటూ, లాగి జీపులో పడేసారు.. మొత్తానికి కంగారులో అవినాష్ రెడ్డి నిజం చెప్పేయటంతో, ఒక్కసారిగా వైసీపీ నేతలు, పులివెందుల కార్యకర్తలు షాక్ తిన్నారు.. దీని పై జగన్ ఎలా స్పందిస్తాడో మరి” అంటూ బుచ్చయ్య రాసుకొచ్చారు. ఈ పోస్ట్ ఇప్పుడు విస్తృతంగా వైరల్ అవుతోంది. మరి ఇది ఎంత వరకు నిజమో చూడాలి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్