ముక్కు ఎక్కడ అంటే.. తల మొత్తం తిప్పి చూపించినట్టు ఉంది ఏపీలో కొన్ని ఫ్లైట్స్ వ్యవహారం. నిత్యం రద్దీగా ఉండే కొన్ని మార్గాల్లో నడిచే ఫ్లైట్స్ ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఎప్పుడు రద్దు చేస్తారో.. ఎందుకు ఆలస్యం అవుతాయో అర్ధం కాక మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా విశాఖ – విజయవాడ తిరిగే విమానాలతో ఇబ్బందులు ఎదురు అవుతున్నాయి. ఆర్ధిక రాజధాని విశాఖ, రాష్ట్ర రాజధాని అమరావతికి ఇప్పుడు ఫ్లైట్స్ సమస్య ఎక్కువగా ఉంది.
Also Read : జగన్ పాపాలు.. మన ప్రాజెక్టులు సెఫేనా..?
ఎప్పుడు, ఏ ఫ్లైట్ క్యాన్సిల్ అవుతుందో అర్ధం కాక కొందరు మంత్రులు.. విశాఖ నుంచి ఒక రోజు ముందు గానే విజయవాడ చేరుకుంటున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో సైతం ఎమ్మెల్యేలు ఇదే సమస్య ఎదుర్కొన్నారు. తాజాగా గంటా శ్రీనివాసరావు ఈ వ్యవహారంపై అసహనం వ్యక్తం చేసారు. “ఆంధ్రా to ఆంధ్రా via తెలంగాణ.. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని విశాఖ నుంచి ఆంధ్రప్రదేశ్ పరిపాలన రాజధాని అమరావతి చేరాలంటే తెలంగాణ రాజధాని హైదరాబాద్ మీదుగా వెళ్లాల్సి రావడం బాధాకరం అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేసారు.
Also Read : ఏబీవీ పొలిటికల్ ఎంట్రీ.. జగన్ నెవర్ ఎగైన్..!
ఉదయం 8 గంటలకు విశాఖ ఎయిర్ పోర్టు వచ్చిన తాను విమానంలో హైదరాబాద్ ఎయిర్ పోర్టుకు చేరి అక్కడినుంచి విజయవాడ విమానం క్యాచ్ చేసి గన్నవరం ఎయిర్ పోర్టులో దిగేసరికి మధ్యాహ్నం 1 గంట అయ్యిందని.. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితో సాయంత్రం సమావేశం కావడానికి విశాఖ నుంచి బయలుదేరిన సీఐఐ, ఫిక్కీ వంటి ట్రేడ్ ప్రతినిధులు కూడా నాలానే హైదరాబాద్ మీదుగా విజయవాడ చేరారని పేర్కొన్నారు.
Also Read : దొరకని కసిరెడ్డి.. మళ్ళీ విజయసాయి రెడ్డికి షాక్
విశాఖ – విజయవాడ మధ్య ఉదయం వేళల్లో నడిచే రెండు విమానాలు రద్దు చేయడంతో ఈ పరిస్థితి వచ్చిందన్నారు. దురదృష్టవశాత్తు ఈరోజు మంగళవారం కావడంతో వందేభారత్ రైలు కూడా లేకపోవడంతో రెండు విమానాలు మారి విజయవాడ చేరాల్సి వచ్చిందని.. ఇది విశాఖ విమాన ప్రయాణీకుల దుస్థితని ఎక్స్ లో పోస్ట్ చేసారు. ఇటీవల ఓ మంత్రి.. విశాఖ విమానాశ్రయంలో దాదాపు నాలుగు గంటల పాటు విమానం కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి దీనిపై కేంద్ర విమానయాన శాఖ, విమానయాన సంస్థలు ఏ నిర్ణయం తీసుకుంటాయో చూడాలి.

