Sunday, March 22, 2026 01:15 PM
Sunday, March 22, 2026 01:15 PM

అగ్ని ప్రమాదంపై వైసీపీ కామెడి ప్రకటన..!

ఇటీవల వైసీపీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్.. నివాసం వెలుపల జరిగిన అగ్ని ప్రమాదం సంచలనం అయింది. నాలుగు రోజుల క్రితం ఏకంగా మూడు సార్లు జగన్ ఇంటి బయట తాడేపల్లిలో అగ్ని ప్రమాదం జరిగింది. ఆ తర్వాతి నుంచి జగన్ భద్రత విషయంలో వైసీపీ ఆందోళన వ్యక్తం చేయడం మొదలుపెట్టింది. ఇక దీనిపై టీడీపీ సెటైర్లు కూడా వేసింది. సిట్ విచారణ కారణంగానే అగ్ని ప్రమాదం జరిగిందని వ్యాఖ్యానించింది. ఇక తాజాగా దీనిపై వైసీపీ కేంద్ర కార్యాలయ ప్రతినిధులు సంచలన వ్యాఖ్యలు చేసారు.

Also Read : రాప్తాడులో మునుగుతున్న వైసీపీ నావ

తాడేపల్లి వైసిపి కేంద్ర కార్యాలయ అగ్నిప్రమాద ఘటనలో పోలీసుల నోటీసులకు సమాధానం ఇచ్చిన కార్యాలయ ప్రతినిధులు.. మాజీ ముఖ్యమంత్రి హోదాలో జగన్ భద్రతపై పలు అనుమానాలున్నాయని వ్యాఖ్యానించారు. జగన్ భద్రత విషయంలో ఇప్పటికే పోలీసులు, కోర్టు దృష్టికి తీసుకెళ్లామని.. అగ్నిప్రమాదం జరిగిందని పోలీసులకు మేమే ఫిర్యాదు చేశాం అని పేర్కొన్నారు. ప్రభుత్వం మారాక జగన్ నివాసం వద్ద బారికేడ్లను, సీసీ కెమెరాలను గతంలోనే తొలగించారని.. ఇప్పుడు మేం ఫిర్యాదు చేస్తే పోలీసులు మాకే నోటీసులు ఇచ్చారన్నారు.

Also Read : తమిళనాడులో విజయ్.. జగన్ ఫార్ములా…?

ఘటన జరిగిన రోజు కార్యాలయానికి వచ్చిన పార్టీ నేతల సమాచారం పోలీసులకు ఇచ్చామని తెలిపారు. రోడ్డుపై అన్నీ వాహనాలకు అనుమతి ఇచ్చారు.. ఘటన జరిగిన సమయంలో రోడ్డుపై ఏఏ వాహనాలు నిలిపి ఉన్నాయో మా వద్ద సమాచారం లేదని చెప్పామని.. సీసీ కెమెరాలకు సంబంధించిన సామాగ్రి మొత్తం గతంలోనే అధికారులు తీసుకువెళ్లారు.. మా దగ్గర ఆ డేటా అందుబాటులో లేదని చెప్పామని పేర్కొన్నారు. జగన్ భద్రత విషయంలో మా ఆందోళన పోలీసుల దృష్టికి తీసుకెళ్లాం అంటూ వ్యాఖ్యానించారు.

Also Read : టీడీపీని ముంచుతున్న “కుటుంబాల చేరికలు”

వాస్తవానికి వీవీఐపీలు తమ ఇళ్ళ బయట సొంతగానే సీసీ కెమెరాలు వంటివి ఏర్పాటు చేసుకుంటారు. భద్రత విషయంలో జగన్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. జగన్ వద్ద వ్యక్తిగత సిబ్బంది వందల్లో ఉంటారు. అలాంటిది సీసీ కెమెరాలు లేవని వైసీపీ సమాధానం ఇవ్వడం ఆశ్చర్యంగా కనపడుతోంది. ప్రభుత్వంపై నెపం నెట్టే కార్యక్రమంలోనే సొంత సీసీ కెమెరాలను బయట ఏర్పాటు చేయలేదని మరికొందరు ఆరోపిస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్