వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో అక్రమ సంపాదనతో చెలరేగిపోయిన మాజీ మంత్రి విడదల రజనీ జైలుకు వెళ్ళక తప్పదా..? అంటే అవుననే సమాధానం వినపడుతోంది. ఆమె మంత్రిగా ఉన్న సమయంలో పల్నాడు జిల్లా యడ్లపాడు లోని శ్రీ లక్ష్మీబాలాజీ స్టోన్ క్రషర్ యాజమాన్యాన్ని బెదిరించి 2.20 కోట్లు వసూలు చేసిన కేసులో ముందస్తు బెయిలు కోసం రజిని, ఆమె మరిది గోపి పిటిషన్లు దాఖలు చేయగా హైకోర్ట్ లో విచారణ జరిగింది. దీనితో.. ఏపీ ప్రభుత్వం హైకోర్ట్ లో నివేదిక సమర్పించింది.
Also Read : బయటపడ్డ వైసీపీ డబుల్ గేమ్..!
విజిలెన్స్ తనిఖీల పేరుతో స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి సొమ్ము వసూలు చేసిన కేసులో మాజీ మంత్రి విడదల రజిని, తదితరుల పై పదేళ్ల వరకు జైలుశిక్షకు వీలున్న ఐపీసీ సెక్షన్ 386ని చేర్చినట్లు ఏజీ దమ్మాల పాటి శ్రీనివాస్ హైకోర్టుకు వివరించారు. అయితే కేసు నమోదు వెనుక రాజకీయ కారణాలున్నాయిని పిటిషనర్ల న్యాయవాదులు హైకోర్ట్ కు తెలిపారు. విజిలెన్స్ విచారణకు పిటిషనర్లు సహకరించారని బెయిలు మంజూరు చేస్తే దర్యాప్తునకు అవరోధం కలగదని తమ వాదనలు వినిపించగా ఏజీ వాదనల కోసం విచారణ ఈనెల 8కి వాయిదా వేసారు.
Also Read : బ్రేకింగ్: మిథున్ రెడ్డి అరెస్ట్ కు రంగం సిద్దం
2020 సెప్టెంబర్ 4న పల్నాడు జిల్లా యడ్ల పాడు మండలం విశ్వనా థుని కండ్రిక గ్రామంలోని శ్రీ లక్ష్మీబాలాజీ స్టోన్‌క్రషర్‌ను అప్పటి చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజిని పీఏ దొడ్డ రామకృష్ణ సందర్శించి.. స్టోన్‌క్రషర్‌పై దాడులు చేయకుండా, మూయించ కుండా ఉండాలంటే ఎమ్మెల్యేని కలవాలని హుకుం జారీ చేయగా.. దీంతో దాని యజమానులు నల్లపనేని చలపతిరావు, నంబూరి శ్రీనివాసరావు రజిని కార్యాలయానికి వెళ్లి కలవగా.. తన పీఏ రామకృష్ణతో మాట్లాడాలని రజిని వారితో చెప్పారు.
Also Read : టీడీపీ లీగల్ సెల్ నిజంగానే బలహీనమా..?
వారిద్దరూ రామకృష్ణను కలవగా ఆయన రూ.5 కోట్లు డిమాండ్ చేయగా.. ఆరు రోజులకే సెప్టెంబర్ 10న అప్పటి గుంటూరు రీజనల్ విజి లెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్ మెంట్ అధికారి – ఆర్‌వీ ఈవోగా ఉన్న ఐపీఎస్ అధికారి పల్లె జాషువా భారీ బృందంతో శ్రీ లక్ష్మీబాలాజీ స్టోన్‌క్రషర్‌లో తనిఖీలకు వెళ్లి హడావుడి చేసి.. డబ్బులు కట్టకపోతే మూయిస్తామని బెదిరింపులకు గురి చేసినట్టు సాక్ష్యాలను సమర్పించారు. అప్పటి విజిలెన్స్ డీజీ అనుమతి కూడా తీసుకోలేదని కోర్ట్ కు వివరించారు. విజిలెన్స్ ప్రధాన కార్యాలయానికి ఈ దాడుల సమాచారం కూడా ఇవ్వలేదని విచారణలో తేలింది. దీనిపై సాక్ష్యాలను కోర్ట్ ముందు ఉంచగా కోర్ట్ విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.