సాధారణంగా పలు వెబ్ సైట్లలో వచ్చే వార్తలు సోషల్ మీడియా లో వైరల్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా ప్రముఖ పత్రికల్లో వచ్చే ఆసక్తికర కథనాలను కాపీ చేసి వైరల్ చేస్తూ ఉంటారు. ఎక్కువగా ఫేస్బుక్, వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాల్లో ఈ వార్తలను చూస్తూనే ఉంటాం. రాజకీయ పార్టీల కార్యకర్తలు తమ అనుకూలంగా ఉన్న వార్తలను ఎక్కువగా షేర్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే న్యూస్ పేపర్ క్లిప్పింగ్ లు కూడా వైరల్ అవుతూ ఉంటాయి. గతంలో న్యూస్ పేపర్ లో వచ్చే వార్తలను ఎక్కువగా చూసే జనాలు.. ఇప్పుడు ఈ తరహా వార్తలకు ఎక్కువగా అలవాటు పడ్డారు.
Also Read : జోగి.. కేరాఫ్ కులం కార్డు..!
అయితే ఈ విషయంలో ప్రముఖ పత్రిక ఈనాడు వ్యవహరించిన శైలి ఇప్పుడు వివాదాస్పదమైంది. తాజాగా ఈనాడు నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. తమ పేపర్, లేదంటే వెబ్ సైట్, ఈనాడు పత్రికను మొత్తం గా లేదా పత్రికలోని కొన్ని వ్యాసాలు మొదలైనవి ఎటువంటి హక్కు లేకుండా యాజమాన్యం అనుమతి తీసుకోకుండా కొంతమంది వ్యక్తులు తెల్లవారే ఈనాడు ఇంటర్నెట్ నుంచి తీసుకుని వారి వాట్సాప్ గ్రూపులో మరియు ఇతర సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం, షేర్ చేయడం ఇతరత్రా వాడటం జరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని.. ఈ విధమైన అనుమతి లేని చర్యలు కాపీ రైట్ చట్టానికి విరుద్ధం అలాగే శిక్షారహమైన నేరం అని ఈనాడు పేర్కొంది.
Also Read : అమరావతి పనుల్లో పురోగతి ఉందా..?
అందువల్ల ఎవరైనా వ్యక్తులు, సంస్థలు లేదా గ్రూపులు ఈనాడు పత్రిక, ఈనాడు.నెట్ ఈనాడు పేపర్ లోని పేజీలు, వ్యాసాలను అనుమతి లేకుండా అప్లోడ్ చేయడం, ఇతర గ్రూపులకు సరఫరా చేయడం లేదా ప్రచారం చేయడం నేరమని హెచ్చరించింది. అట్టి చర్యలను ఈనాడు చాలా తీవ్రంగా పరిగణించి సదరు బాధ్యులపై సివిల్ మరియు క్రిమినల్ చర్యలు తీసుకుంటుందని హెచ్చరిస్తూ.. ఈనాడు లీగల్ డిపార్ట్మెంట్ హెడ్ ఓ ప్రకటన విడుదల చేశారు. దీనిపై టిడిపి కార్యకర్తలు మండిపడుతున్నారు. సాధారణంగా టిడిపి కార్యకర్తలు ఈనాడు కథనాలను ఎక్కువగా ఇష్టపడుతుంటారు. పక్కా.. సమాచారం ఉంటుందనే కారణంతో ఈనాడు కథనాలను వైరల్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈనాడు చేసిన ప్రకటనతో ఆ పార్టీ కార్యకర్తలు కంగుతిన్నారు. ఈనాడు వార్తలతో ఆదాయం సంపాదిస్తే తప్పని, ఇతరులకు సమాచారం చేరవేస్తే అందులో తప్పేమి ఉంటుందని, ఈనాడు లాంటి సంస్థ నుంచి తాము ఇటువంటి ప్రకటన ఆశించలేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు.

