ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 నిర్వహణపై ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్తాన్ ఆతిథ్యమిస్తుంది. అయితే భారత్ – పాక్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు సరిగా లేని కారణంగా భారత్ జట్టు పాకిస్థాన్ లో ఆడేది లేదని తేల్చి చెప్పింది. దీంతో టీమిండియా ఆడుతున్న మ్యాచులను తటస్థ వేదికలో నిర్వహించాలని ఐసీసీ నిర్ణయించింది. భారత్ – పాకిస్తాన్ మధ్య తటస్థ వేదికగా దుబాయ్ స్టేడియంలో రోహిత్ సేన మ్యాచులు ఆడుతోంది.
Also Read : జగన్ కు మరో మాజీ ఝలక్ ఇస్తారా..?
దుబాయ్ లోని దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో బ్యాచులు నిర్వహించడంపై ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దుబాయిలో నాలుగు మ్యాచ్ లు నిర్వహిస్తున్నారు. భారత్ – బంగ్లాదేశ్ మధ్య జరిగిన తొలి మ్యాచ్ లోనే స్టేడియంలో పరిస్థితులు క్రికెటర్లతోపాటు నిర్వాహకులను కూడా భయపెడుతున్నాయి. భారత్ కాలమాన ప్రకారం మధ్యాహ్నం 2.30 గంటలకు మ్యాచ్ మొదలైంది. దుబాయిలో వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో విపరీతమైన ఎండ వేడిమి కారణంగా క్రికెటర్లు పూర్తిగా నిరసించి పోయారు. అటు ప్రేక్షకులు సైతం ఎండ వేడిమి తట్టుకోలేక అస్వస్థతకు గురయ్యారు. బంగ్లాదేశ్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మన్ హ్రిదోయ్ 116 బంతుల్లో సెంచరీ చేశాడు. అయితే ఆ సెంచరీ పూర్తి చేసే ముందు వేడి కారణంగా వడ దెబ్బకు గురయ్యాడు. అతి కష్టం మీద చివరి పది పరుగులు చేయగలిగాడు. పలుమార్లు ఫిజియోథెరపీ చికిత్స కారణంగా ఆటకు అంతరాయం ఏర్పడింది కూడా.
Also Read : నందిగం సురేష్ ను దూరం పెట్టేసిన జగన్..?
ఇక 229 పరుగులు స్వల్ప లక్ష్యాన్ని సాధించడానికి కూడా రోహిత్ సేన బాగా కష్టపడాల్సి వచ్చింది. పూర్తిగా పొడిబారిన బీచ్, అవుట్ ఫీల్డ్ వల్ల బంతిని ఎంత బలంగా కొట్టినప్పటికీ బౌండరీ లైన్ దాటలేక పోయింది. ఓపెన్ స్టేడియం కావటం వల్ల ప్రేక్షకులు కూడా పెద్దగా రాలేదు. 25 వేల సీటింగ్ కెపాసిటీ ఉన్న స్టేడియంలో కనీసం సగం సీట్లు కూడా ఫుల్ కాలేదు. అయితే ఇండియా – పాకిస్తాన్ మ్యాచ్ టికెట్లు మాత్రం మొత్తం అమ్ముడుపోయాయి. ఇలాంటి స్టేడియంలో చిరకాల ప్రత్యర్థుల మధ్య మ్యాచ్ అంటే.. భారీ స్కోరు సాధ్యం కాదని క్రికెట్ లవర్స్ వ్యాఖ్యలు చేస్తున్నారు. మరి ఆదివారం నాటికైనా పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంటుందా లేదా అనేది చూడాల్సి ఉంది.

