Tuesday, March 24, 2026 11:51 PM
Tuesday, March 24, 2026 11:51 PM

వచ్చే వారం ఇండియన్స్ కు ట్రంప్ గుడ్ న్యూస్..!

భారత్ విషయంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అనుసరిస్తోన్న వైఖరిలో మార్పు రావడంతో.. భారత్ – అమెరికా సంబంధాల విషయంలో కీలక మార్పులు జరిగే అవకాశం కనపడుతోంది. అమెరికా సుంకాలను 18 శాతానికి తగ్గించడం, భారత్.. రష్యా నుండి చమురు కొనుగోలును నిలిపివేయడం , అమెరికా నుండి 500 బిలియన్ డాలర్ల ఇంధన, సాంకేతిక ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి కట్టుబడి ఉండటం వంటివి ఇప్పుడు కీలకంగా మారాయి. ఈ తరుణంలో భారత్ – అమెరికా వాణిజ్య ఒప్పందం వచ్చే వారం ప్రారంభంలో జరిగే అవకాశం కనపడుతోంది.

Also Read : ఏ ఒక్కడినీ వదిలిపెట్టం.. చంద్రబాబు ఉగ్రరూపం

ఈ ఒప్పందంపై సంతకం చేసేందుకు అమెరికన్ సీనియర్ అధికారులు ఢిల్లీలో ఉంటారని జాతీయ మీడియా తెలిపింది. చర్చలు, ఒప్పందాలను వచ్చే వారం అధికారికంగా ప్రకటిస్తారు. పాడి, మత్స్య, ఇతర రైతు ఉత్పత్తులకు వచ్చే వారం గుడ్ న్యూస్ ఉంటుందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. అదే విధంగా భారతీయులకు వీసా మంజూరు చేసే విషయంలో కూడా ట్రంప్ సర్కార్ కొన్ని కీలక ఇమ్మిగ్రేషన్ విధానాలను ప్రకటించే అవకాశం కనపడుతోంది. హెచ్ 1 బీ వీసాల విషయంలో కూడా కీలక ప్రకటన ఉండే అవకాశం ఉంది.

Also Read : ఇండియన్స్ కు సింగపూర్ రెడ్ కార్పెట్..!

హెచ్ 1 బీ వీసాలకు సంబంధించి ప్రతిష్టంభన కొనసాగుతోంది. హెచ్ 1 బీ వీసాల్లో భారతీయులే ఎక్కువగా ఉండటంతో.. కొంత ఆందోళన ఉంది. దీనికి వచ్చే వారం ముగింపు పలికే అవకాశం ఉంది. వెనిజులా, అమెరికా నుంచి చమురు కొనుగోలు చేసే విషయంలో భారత్ అంగీకారం తెలిపిన సంగతి తెలిసిందే. రష్యా నుంచి పూర్తిగా చమురు ఉత్పత్తులను నిలిపివేయనుంది భారత్. ఇక సుంకాలు తగ్గడంతో భారత్ నుంచి పెద్ద ఎత్తున అమెరికాకు వస్త్ర సహా అనేక ఎగుమతులు ఉండనున్నాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

బ్రేకింగ్: డేంజర్ జోన్...

ఏపీలోని బెజవాడ నగరం వేదికగా సాగుతున్న...

బ్రేకింగ్: మాట నిలబెట్టుకున్న...

గత కొన్ని రోజులుగా విమర్శలు ఎదుర్కొంటున్న.....

ఏపీపై రైల్వే శాఖ...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధిలోకి...

బాబోయ్.. బెజవాడలో ఉగ్రవాదులు..!

విజయవాడ వాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. విజయవాడలో...

బ్రేకింగ్: ఐటీ రంగంపై...

అమెరికా, ఇజ్రాయిల్ వర్సెస్ ఇరాన్ యుద్ధం...

దానంపైనే బీఆర్ఎస్ గురి..?...

2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత.....

పోల్స్