Wednesday, March 25, 2026 01:36 PM
Wednesday, March 25, 2026 01:36 PM

ట్రంప్ మెప్పు కోసమేనా..? రష్యా ఆయిల్ భారత్ కొనాల్సిందే..?

రష్యన్ ముడి చమురు విషయంలో ఇప్పుడు నెలకొన్న సందిగ్దత.. అంతర్జాతీయంగా హాట్ టాపిక్ అవుతోంది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.. ఉక్రెయిన్ – రష్యా యుద్దాన్ని సాకుగా చూపి, వెనిజుల ఆయిల్ ను భారత్ కు విక్రయించేందుకు వేసిన ఎత్తుగడలో భాగంగా విధించిన సుంకాలు.. ఇటీవల తగ్గించారు. ఇక భారత్.. రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేసే అవకాశం లేదని ట్రంప్ ప్రకటించారు. కానీ అది ఆగే అవకాశం లేదని నిపుణులు అంటున్నారు. రష్యా నుంచి భారత్ ఆయిల్ ను దిగుమతి చేసుకోవాల్సిందే అంటున్నారు.

Also Read : పాకిస్థాన్‌ లోనూ ‘ధురంధర్’ విధ్వంసం

దీనితో పాటుగా రాబోయే ఐదేళ్ళలో అమెరికా నుండి 500 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను దిగుమతి చేసుకునేందుకు అంగీకారం తెలిపిందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నప్పటికీ, ఈ రెండు సాధ్యం కాదని అంటున్నారు పరిశీలకులు. వాస్తవాలను పరిగణనలోకి తీసుకుంటే, చౌకైన ముడి చమురు కొనుగోలు చేయడం చట్టవిరుద్ధం కాదు. అలా చేస్తే అమెరికా ఏ విధమైన చర్యలు తీసుకునే అవకాశం లేదు. ట్రంప్ ఒత్తిడి మేరకు ఇప్పుడు ఆపేసినా సరే తర్వాత మళ్ళీ కొనుగోలు చేసే అవకాశం ఉంది.

Also Read : కుల చిచ్చు కోసం కొత్త డ్రామా..?

వెనిజులా ఆయిల్ ను భారత్ కొనుగోలు చేస్తే.. దేశంలో మళ్ళీ ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. పలు రాష్ట్రాలకు ఎన్నికలు ఉన్న నేపధ్యంలో ఈ పరిణామం ఖచ్చితంగా కేంద్రానికి ఇబ్బందిగా మారుతుంది. ఇక యూరప్ దేశాలతో వాణిజ్య ఒప్పందం చేసుకున్న నేపధ్యంలో.. భారత ఎగుమతులకు అమెరికాను పక్కన పెట్టే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఆయిల్ దిగుమతులను రష్యా నుంచి భారత్ నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC) మరియు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) వంటి శుద్ధి కర్మాగారాలు తమ కొనుగోళ్లను తగ్గించుకున్నాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

బ్రేకింగ్; ఏపీలో మున్సిపల్...

ఏపీలో స్థానిక సంస్థల సమరానికి మున్సిపల్...

కిమిడి సోదరుల మధ్య...

తెలుగు రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న...

బ్రేకింగ్: డేంజర్ జోన్...

ఏపీలోని బెజవాడ నగరం వేదికగా సాగుతున్న...

బ్రేకింగ్: మాట నిలబెట్టుకున్న...

గత కొన్ని రోజులుగా విమర్శలు ఎదుర్కొంటున్న.....

ఏపీపై రైల్వే శాఖ...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధిలోకి...

బాబోయ్.. బెజవాడలో ఉగ్రవాదులు..!

విజయవాడ వాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. విజయవాడలో...

పోల్స్