Sunday, March 22, 2026 02:35 PM
Sunday, March 22, 2026 02:35 PM

ధూళిపాళ్ళ మాటకు పవన్ విలువిచ్చారా…?

పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారు వెంకట రోశయ్యను పార్టీ మారకుండా అడ్డుకుంటున్నారా..? జనసేనలోకి వెళ్లాలన్న ఆయన ప్రయత్నాలను అడ్డుకునే విషయంలో టిడిపి నేతలు సక్సెస్ అవుతున్నారా..? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో రెచ్చిపోయిన వాళ్లలో వెంకట రోశయ్య కూడా ఒకరు. అక్రమాలు, కబ్జాలు దందాలతో ఆయన ఐదేళ్లపాటు గట్టిగానే వెనకేశారు. అయితే వైసిపి అధికారం కోల్పోయిన తర్వాత ఆ పార్టీకి రాజీనామా చేసి.. జనసేన పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు చేశారు.

Also Read : జగన్ కు మరో మాజీ ఝలక్ ఇస్తారా..?

మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తో పాటుగా పార్టీ మారెందుకు ఆయన తనవంతు కృషి చేశారు. కానీ అప్పుడు ఆయన చేరిక ఆగింది. ఇక ఆ తర్వాత పలుమార్లు జనసేనలో చేరేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. అయినా సరే ఆ ప్రయత్నాలు ముందుకు వెళ్లడం లేదు. ఒకానొక సమయంలో జనసేన పార్టీ కార్యాలయానికి కూడా వెళ్లి.. పవన్ కళ్యాణ్ సమక్షంలో కండువా కప్పుకోవాలని ఆయన ప్లాన్ చేశారు. ఆ ప్రయత్నాలు కూడా అర్థంతరంగా ఆగిపోయాయి. అయితే వెంకట రోశయ్య పార్టీ మారకుండా ఆగిపోవడానికి కారణం టిడిపి నేతలు అని తెలుస్తుంది.

Also Read : నందిగం సురేష్ ను దూరం పెట్టేసిన జగన్..?

పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర.. వెంకట రోశయ్య పార్టీ పార్టీ మారకుండా చేయడంలో సక్సెస్ అవుతున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ అతను పార్టీ మారితే నియోజకవర్గంలో కూటమి వాతావరణంలో ఇబ్బందికర పరిణామాలు ఉండే అవకాశం ఉందని.. అలాగే అతను చేసిన అక్రమాలు కూడా తీవ్రస్థాయిలో ఉన్నాయని.. అది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ క్యాడర్లో, ప్రజల్లో వ్యతిరేకతను పెంచుతుందని.. అలాగే గత ఐదేళ్లపాటు అతని జనసేన కార్యకర్తలను కూడా ఇబ్బందులకు గురి చేశాడని.. పలు సాక్షాలతో సహా పవన్ కళ్యాణ్ వద్ద నరేంద్ర ఉంచినట్లు వార్తలు వస్తున్నాయి.

ముఖ్యంగా ముస్లిం వర్గాల్లో, బీసీల్లో అతనంటే కోపం ఉందని.. కాబట్టి ఈ విషయంలో వెనక్కు తగ్గితే మంచిదని పవన్ సూచించినట్టు తెలుస్తోంది. వాస్తవానికి ఫిబ్రవరిలో కూడా వెంకటరోశయ్య పార్టీ మారే అవకాశం ఉందని భావించారు. కానీ అది కూడా సక్సెస్ కావడం లేదు. ఈ క్రమంలోనే వెంకట రోశయ్య అక్రమాలను ఒక్కొక్కటిగా టిడిపి బయట పెడుతూ వస్తోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్