Sunday, March 22, 2026 06:15 AM
Sunday, March 22, 2026 06:15 AM

ఈరోజు (11-11-2025) మీ రాశి ఫలితాలు

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయణం, శరదృతువు, కార్తీక మాసం, బహుళపక్షం 11-11-2025 నాడు మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటున్నారా, అయితే ఆ వివరాలు మీకోసం. మీ గ్రహాల ప్రభావం ఎలా ఉందో చెక్ చేసుకోండి.

మేషం 11-11-2025

దైవదర్శనాలు చేసుకుంటారు. వృధా ఖర్చులు అదుపు చెయ్యడం మంచిది. వృత్తి, వ్యాపారాలు సాదాసీదాగా సాగుతాయి. మాతృ సంభంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది.

—————————————

వృషభం 11-11-2025

సంతానం పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితుల నుండి శుభ వార్తలు అందుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. నూతన వాహనయోగం ఉన్నది. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.

—————————————

మిధునం 11-11-2025

ముఖ్యమైన పనులు కొన్ని వాయిదా పడుతాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు చికాకు కలిగిస్తాయి. ధన పరమైన సమస్యలు బాధిస్తాయి. దైవ చింతన పెరుగుతుంది. చేపట్టిన పనులలో శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. వ్యాపార, ఉద్యోగాలలో అనుకోని మార్పులు ఉంటాయి.

—————————————

కర్కాటకం 11-11-2025

ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. నూతన విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. విద్యార్థులు ఆశించిన ఫలితాలు సాధిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. గృహమున ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి.

—————————————

సింహం 11-11-2025

పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార పరంగా భాగస్థులతో వివాదాలు కలుగుతాయి. ముఖ్యమైన పనులు వ్యయప్రయాసలతో కానీ పూర్తికావు. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. ఆదాయ మార్గాలు మందగిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.

—————————————

కన్య 11-11-2025

ఆప్తుల సలహాలతో ముందుకు సాగడం మంచిది. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఆకస్మిక ధన లాభాలు పొందుతారు. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. విలువైన వస్తులాభాలు పొందుతారు. చిన్ననాటి మిత్రుల కలయిక ఉత్సాహనిస్తుంది.

—————————————

తుల 11-11-2025

విద్యార్థులకు నూతన అవకాశములు అందుతాయి. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు అందుతాయి. ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు.

—————————————

వృశ్చికం 11-11-2025

స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుంబంలో ఒత్తిడులు పెరుగుతాయి. ముఖ్యమైన పనులలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప నష్టాలు తప్పవు. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. ఇంటా బయట బాధ్యతలు మరింతగా పెరుగుతాయి.

—————————————

ధనస్సు 11-11-2025

సంతాన ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఇతరులకు ధన పరంగా మాట ఇవ్వడం మంచిది కాదు.

—————————————

మకరం 11-11-2025

చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. సంఘంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. ఆప్తుల నుండి విలువైన సమాచారం అందుతుంది. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. బంధు మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ఆర్థికాభివృద్ధి కలుగుతుంది.

—————————————

కుంభం 11-11-2025

కీలక సమయంలో సన్నిహితుల సాయం అందుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన పనులలో శ్రమ ఫలిస్తుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. సంతాన విద్య ఉద్యోగ విషయంలో శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.

—————————————

మీనం 11-11-2025

ఉద్యోగాలలో అధికారులతో కొద్దిపాటి వివాదాలు తప్పవు. ఆర్థిక లావాదేవీలు అంతంత మాత్రంగా ఉంటాయి. అనుకోని ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. చేపట్టిన పనులలో తొందరపాటు నిర్ణయాలు చెయ్యడం మంచిది కాదు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వాయిదా పడుతాయి.

—————————————

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్