Wednesday, February 4, 2026 08:32 AM
Wednesday, February 4, 2026 08:32 AM

ఈరోజు (24-01-2026) మీ రాశి ఫలితాలు

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, మాఘ మాసం, శుక్ల పక్షం 24-01-2026 నాడు మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటున్నారా, అయితే ఆ వివరాలు మీకోసం. మీ గ్రహాల ప్రభావం ఎలా ఉందో చెక్ చేసుకోండి…

మేషం

ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరిగి విశ్రాంతి లభించదు. దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. చేపట్టిన పనులలో అవరోధాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలు మరింత నిరాశ కలిగిస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది.

—————————————

వృషభం

ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. వృత్తి వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. ఉద్యోగమన వివాదాలు సర్దుమణుగుతాయి. కొన్ని ముఖ్యమైన విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు కలిసివస్తాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. కుటుంబ వాతావరణం సందడిగా ఉంటుంది.

—————————————

మిధునం

గృహమున వివాహ ప్రస్తావన వస్తుంది. నూతన వస్తు వాహన లాభాలు పొందుతారు. ఆలోచనలు ఆచరణలో పెడతారు. బంధుమిత్రులు నుండి శుభవార్తలు అందుతాయి. వృత్తి వ్యాపారాలలో ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకుని లాభపడతారు. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

—————————————

కర్కాటకం

ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఆకస్మికంగా ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఉద్యోగస్తులకు పనిభారం పెరుగుతుంది. సంతాన విద్య ఉద్యోగ విషయాలలో కొంత నిరుత్సాహం తప్పదు.

—————————————

సింహం

చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు ఉంటాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి వ్యాపారాలలో మరింత ఒత్తిడి పెరుగుతుంది. బంధుమిత్రులతో మాట పట్టింపులుంటాయి. ఉద్యోగస్తులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. నిరుద్యోగులకు మరింత కష్టం తప్పదు.

—————————————

కన్య

సంతానానికి నూతన విద్యావకాశాలు లభిస్తాయి. పాత మిత్రుల నుండి శుభ కార్య ఆహ్వానాలను అందుకుంటారు. కొన్ని వ్యవహారాలలో అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తిచేస్తారు. వృత్తి వ్యాపారాలలో నష్టాలు భర్తీ చేస్తారు. ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

—————————————

తుల

ప్రయాణాలు వాహన ఇబ్బందులుంటాయి. బంధు మిత్రులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. అనుకొన్న సమయానికి పనులు పూర్తి కావు. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారస్తులకు వచ్చిన అవకాశాలు చేజారిపోకుండా చూసుకోవాలి. ఉద్యోగ విషయంలో ఉన్నతాధికారులతో ఊహించని సమస్యలు కలుగుతాయి.

—————————————

వృశ్చికం

స్ధిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాలలో ఉన్నత ఫలితాలను పొందుతారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు. దైవ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఉద్యోగస్తులకు శ్రమకు అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు.

—————————————

ధనస్సు

దాయాదులు తో స్థిరాస్తి వివాదాలు తప్పవు. వృత్తి వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఇంటా బయట ఊహించని సమస్యలు ఎదురవుతాయి. చేపట్టిన కార్యక్రమాలలో స్వల్ప వివాదాలు ఉంటాయి. ఉద్యోగ వాతావరణం నిరుత్సాహ పరుస్తుంది. దూర ప్రయాణాల వలన శారీరక శ్రమ పెరుగుతుంది. ధన పరంగా జాగ్రత్తగా వ్యవహరించాలి.

—————————————

మకరం

బంధు మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. స్థిరాస్తి వివాదాలు రాజీ చేసుకుంటారు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. వృత్తి వ్యాపారాలలో మరింత పుంజుకుంటాయి. ఉద్యోగస్తులకు సహోద్యోగుల సహాయంతో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది.

—————————————

కుంభం

అనుకున్న పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు. మిత్రులతో సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. సమాజంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుంచి బయటపడతారు. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది.

—————————————

మీనం

కుటుంబ సభ్యుల ప్రవర్తన ఆశ్చర్యపరుస్తుంది. దీర్ఘకాలిక రుణ ఒత్తిడి పెరగటం వలన శారీరక మానసిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలలో అవాంతరాలు ఉంటాయి. వ్యాపారాలు నత్తనడకగా సాగుతాయి. ఉద్యోగమున ఒడిదుడుకులు పెరుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ తప్పదు.

————————————-

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?

కూటమి అంటే.. ఒక ఉమ్మడి కుటుంబం...

ఏపీ కేబినేట్ సంచలన...

తిరుమల కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి...

దమ్ముంటే అసెంబ్లీకి రా.....

గత రెండు రోజులుగా తనను ఉద్దేశించి...

బ్రేకింగ్: చంద్రబాబు –...

ఏపీలో ప్రస్తుతం జరుగుతోన్న రాజకీయ పరిణామాలు...

సింఘాల్‌ సరే.. తర్వాత...

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి...

అందరి బ్రతుకు నాకు...

గతవారం పది రోజుల నుంచి ఏపీలో...

పోల్స్