Sunday, March 22, 2026 11:55 AM
Sunday, March 22, 2026 11:55 AM

ధోనీపై ఆగని తిట్ల వర్షం

టీమిండియా మాజీ కెప్టెన్ ప్రస్తుత చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని పై విమర్శలు ఆగడం లేదు. చెన్నై జట్టుకు ఐదుసార్లు ట్రోఫీ అందించిన ధోని ఇప్పుడు ఆ జట్టుకు భారంగా మారాడు అంటూ కొంతమంది సోషల్ మీడియాలో కంటిన్యూగా కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. తాజాగా మళ్లీ చెన్నై కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన ధోని.. జట్టుకు ఈ సీజన్లో రెండో విజయాన్ని అందించిన సరే సోషల్ మీడియాలో అభిమానులు మాత్రం శాంతించడం లేదు. ఈ టోర్నీలో ధోని ఇప్పటివరకు ఆకట్టుకునే ప్రదర్శన చేయలేదు.

Also Read : దొరకని కసిరెడ్డి.. మళ్ళీ విజయసాయి రెడ్డికి షాక్

ధోని విలువైన ఇన్నింగ్స్ ఆడాల్సిన సమయంలో కూడా ఆచితూచి ఆడటంపై గతంలో ఎన్నో విమర్శలు వచ్చాయి. రెండు మూడు మ్యాచ్లు ఓడిపోవడానికి ధోని కారణమని ఆరోపణలు కూడా అభిమానుల నుంచి పెద్ద ఎత్తున వినిపించాయి. ప్రస్తుతం రుతురాజ్ గైక్వాడ్ గైర్హాజరుతో ధోని కెప్టెన్గా తిరిగి బాధ్యతలు చేపట్టాడు. అయితే తాజాగా లక్నోతో జరిగిన మ్యాచ్లో ధోని ఆట తీరుపై అభిమానులు కాస్త సంతోషంగానే ఉన్న విమర్శకులు మాత్రం ధోనిపై విరుచుకుపడుతున్నారు. రుతురాజ్ కెప్టెన్గా ఉన్న సమయంలో ధోని బ్యాటింగ్లో ఆకట్టుకోలేకపోయాడు.

Also Read : మళ్ళీ మొదలైన టీ కాంగ్రెస్ మంత్రి పదవి రచ్చ

అయితే తాను కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత మాత్రం బ్యాట్ కు పని చెప్పడంతో ధోని స్వార్థపరుడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు యాంటీ ఫ్యాన్స్. మరి కొంతమంది మాత్రం ఈ మ్యాచ్ లో కూడా ధోని ఆడక పోతే అతనిపై విమర్శలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఆడాడు అంటూ కామెంట్ చేస్తున్నారు. అటు చెన్నై అభిమానులపై కూడా క్రికెట్ విశ్లేషకులు విమర్శలు చేస్తూనే ఉన్నారు. ధోని భజన ఆపాలని లేకపోతే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు రోజురోజుకు మరింత దారుణంగా మారే అవకాశం ఉంటుందని.. లక్నోతో జరిగిన మ్యాచ్లో లక్నో వెనుక 200 కు పైగా పరుగులు చేసి ఉంటే కచ్చితంగా చెన్నై జట్టు ఓడిపోయి ఉండేదని.. తక్కువ లక్ష్యాన్ని కూడా అతి కష్టంగా ఛేదించారు అంటూ మండిపడుతున్నారు. ఇతర జట్టులతో పోలిస్తే చెన్నై జట్టు మిడిల్ ఆర్డర్ అత్యంత బలహీనంగా ఉందని కాబట్టి దానిమీద దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్