Sunday, March 22, 2026 05:52 PM
Sunday, March 22, 2026 05:52 PM

నోరు జారితే వీసా పోయినట్టే.. సోషల్ మీడియాపై గురి..!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత మనం ఏది మాట్లాడినా చెల్లుతుంది అనే భావన చాలా మందిలో ఉంటుంది. రాజకీయాలు, సామాజిక అంశాలు, మతపరమైన వ్యవహారాలు, వ్యక్తిగత అంశాలు, అంతర్జాతీయ అంశాలు ఇలా ఏదైనా మాట్లాడవచ్చు.. వాటికి సంబంధించి ప్రసంశలు, విమర్శల రూపంలో మన అభిప్రాయాలను తెలియజేసే అవకాశం వచ్చేసింది. కానీ క్రమంగా ఇది హద్దు మీరడం, వాక్ స్వాతంత్ర్యం పరిధి దాటడం వంటివి ఈ మధ్య కాలంలో పదే పదే మనం చూస్తున్నాం.

Also Read : అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా.. జగన్ డబుల్ గేమ్..!

ఇప్పుడు వీటిపైనే ప్రపంచ దేశాలు దృష్టి పెట్టాయి. తమ దేశంలో ఉంటూ తమ మతాన్ని, విధానాలను, పాలనను విమర్శించే వాళ్లకు వీడ్కోలు పలికేందుకు సిద్దమయ్యాయి. యూరప్, గల్ఫ్, అమెరికా సంయుక్త రాష్ట్రాలు, కెనడా వంటి దేశాలు ఇప్పుడు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. నోరు జారినా, చేతి రాత అదుపు తప్పినా.. వీసా రద్దు చేసేందుకు వెనకడుగు వేయడం లేదు. ఈ ఏడాదిలో మొత్తం 3 వేల మందిని ఈ దేశాలు వెనక్కు పంపాయి. ప్రత్యేక బృందాలను నియమించుకుని నిఘా పెట్టాయి.

Also Read : ఆయనను ఒంటరిని చేసిన కమలనాథులు..!

గత పదేళ్లుగా ఏం రాసారు, ఏం మాట్లాడారు అంటూ కూపీ లాగుతున్నాయి. ఒకరకంగా తవ్వుతూ.. వేటాడుతున్నాయి. మత్స్యకారులు సముద్రంలో వల వేసినట్టు.. ప్రతీ చిన్న చేప చేష్టలపైన గురి పెట్టాయి. వీసా ఇంటర్వ్యూల సమయంలోనే కాదు.. వీసాతో ఆయా దేశాల్లో ఏళ్ళ తరబడి ఉన్న వాళ్ళపైన ఫోకస్ చేసాయి. క్షమాపణకు, వివరణకు అవకాశం లేకుండా వేటాడుతున్నారు. సాక్ష్యాలతో చరిత్రను కళ్ళ ముందు ఉంచి బాయ్ బాయ్ చెప్పేస్తున్నారు. వలస విధానాలు అనుకూలంగా మార్చుకుని, తమ దేశాల్లో తిష్ట వేసిన వారిని వదిలించుకుని, తమ పౌరులకు ఉద్యోగాలు ఇచ్చేందుకు ఉన్న అన్ని అవకాశాలను వాడుకుంటున్నాయి. లేని అవకాశాలు సృష్టిస్తూ పరుగులు పెట్టిస్తున్నాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్