Sunday, March 22, 2026 12:01 PM
Sunday, March 22, 2026 12:01 PM

ఏపీలో కాంగ్రెస్ ఘర్ వాపసీ..?

ఏపీలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి పార్టీ అధిష్టానం అడుగులు వేస్తోందా..? అంటే అవుననే సంకేతాలు వస్తున్నాయి. రాజకీయంగా ఒకప్పుడు ఏపీలో ఆ పార్టీ కీలక పాత్ర పోషించింది. దశాబ్దాల పాటు అధికారంలో ఉంది. అయితే విభజన తర్వాత మాత్రం పార్టీ క్రమంగా బలహీనపడింది. బలమైన నాయకులు అందరూ వైసీపీలోకి వెళ్లిపోవడంతో పార్టీకి భవిష్యత్తు కష్టంగా మారింది. ఇప్పుడు కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల తీవ్రంగా కష్టపడే ప్రయత్నం చేస్తున్నా.. క్షేత్ర స్థాయిలో వాతావరణం అనుకూలంగా లేదు.

Also Read : ఇంత ధీమాతో ఎలా ఉన్నారు ధర్మారెడ్డి గారు..?

అయితే ఇప్పుడు పార్టీని బలోపేతం చేసేందుకు అధిష్టానం ఘర్ వాపసీ కార్యక్రమాన్ని మొదలుపెడుతోంది. రాజకీయాల నుంచి, పార్టీ నుంచి బయటకు వెళ్ళిన వారిపై గురి పెట్టింది. ఏపీలో భారీ బహిరంగ సభ నిర్వహించి క్యాడర్ ను గాడిలో పెట్టే దిశగా అడుగులు వేస్తుంది. ఈ బహిరంగ సభకు సోనియా గాంధీని ఆహ్వానించాలని భావిస్తున్నట్టు సమాచారం. ఉండవల్లి అరుణ్ కుమార్, రఘువీరా రెడ్డి, రఘురామి రెడ్డి, లగడపాటి రాజగోపాల్, సాయి ప్రతాప్ వంటి వాళ్లకు స్వాగతం పలుకుతుంది.

Also Read : ఏపీ రియల్ రంగానికి బూస్ట్..? మారుతోన్న పరిస్థితి..!

కనుమూరి బాపి రాజు, పల్లం రాజు, డిఎల్ రవీంద్రా రెడ్డి వంటి వాళ్లకు ఇప్పటికే అధిష్టానం నుంచి ఫోన్ లు కూడా వెళ్లినట్టు సమాచారం. అగ్ర నాయకత్వం మొత్తం ఇప్పుడు సైలెంట్ అయిపొయింది. షర్మిల మినహా ఇతర నాయకులు కనపడటం లేదు. ఇక వైసీపీలో ఉన్న వారిని కూడా తిరిగి ఆహ్వానించే ప్రయత్నాలు మొదలుపెట్టింది. కొందరు వైఎస్ జగన్ తీరుతో ఇబ్బంది పడుతున్న వారిని కూడా వైసీపీ నుంచి తిరిగి పిలవాలని భావిస్తున్నట్టు రాజకీయ వర్గాలు అంటున్నాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్