Wednesday, February 4, 2026 06:44 AM
Wednesday, February 4, 2026 06:44 AM

మాట జాగ్రత్త.. మంత్రులకు సిఎం వార్నింగ్

తప్పుడు ప్రచారం చేసే విషయంలో వైసీపీ నేతలు ముందు ఉంటారు అనే మాట వాస్తవం. అగ్ర నాయకుల నుంచి క్షేత్ర స్థాయిలో కార్యకర్తల వరకు ప్రతీ ఒక్కరు ఏదోక ప్రచారం చేస్తూ ఉంటారు. ఇటీవల కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి సిబిఐ సిట్ దాఖలు చేసిన చార్జ్ షీట్ లో ప్రస్తావించిన అంశాలపై వైసీపీ సోషల్ మీడియాలో హడావుడి నడుస్తోంది. అటు వైసీపీ నేతలు కూడా మీడియాలో ప్రభుత్వాన్ని టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై తాజాగా కేబినెట్ భేటీ అనంతరం మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించారు.

Also Read : ఆ కులానికే చంద్రబాబు ప్రాధాన్యత..!

ప్రతీ రాజకీయ సబ్జెక్టుపై మంత్రులు, పార్టీ నేతలు ప్రిపేరై మాట్లాడాలని సీఎం చంద్రబాబు సూచించారు. 1985 నుంచి తాను ప్రతి సబ్జెక్టుపై ఎలా ప్రిపేరై మాట్లాడింది మంత్రులతో పంచుకున్నారు సిఎం. గొడ్డలి పోటు, కోడికత్తి, పరకామణిలో చోరీ ఇలా ప్రతీ అంశంపై ప్రజలకు వాస్తవాలు చెప్పాలన్నారు. ఇప్పుడు కల్తీ లడ్డు విషయంలో కూడా మాట్లాడే మాటలపై జాగ్రత్తగా ఉండాలని సిఎం సూచించారు. టీవీ డిబేట్ లో మాట్లాడే మాట్లాడే మాటలు ఒకటికి పది సార్లు ఆలోచించుకోకపోతే ప్రభుత్వం పార్టీ ఇబ్బంది పడుతుందని సూచించారు.

Also Read : ఆధారాల్లేకుండా ఆరోపణలు… ఇదేనా సాక్షి జర్నలిజం?

ఈ సమావేశంలో కల్తీ నెయ్యికి సంబంధించి మంత్రులు మరికొన్ని విషయాలను సీఎం వద్ద ప్రస్తావించగా.. కాంట్రాక్ట్ తీసుకున్న డెయిరీలు కొన్ని రసాయనాలు మిశ్రమం ఉపయోగించి నెయ్యి తయారు చేశారని చంద్రబాబుకు మంత్రులు వివరించారు. వైసీపీ హయాంలో తప్పు చేసి ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద నెట్టే ప్రయత్నం చేశారని చెప్పగా.. సిట్ నివేదిక వచ్చిన తరువాత మాట్లాడుదామని మంత్రులకు సూచించారు. వైసీపీ నేరప్రవృత్తి అలానే ఉంటుందని, కోడి కత్తి, బాబాయి గొడ్డలి, గులక రాయి కేసులు ఎలా చేశారో మీరు చూశారు కదా? అంటూ గత సంఘటనలను గుర్తు చేసారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?

కూటమి అంటే.. ఒక ఉమ్మడి కుటుంబం...

ఏపీ కేబినేట్ సంచలన...

తిరుమల కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి...

దమ్ముంటే అసెంబ్లీకి రా.....

గత రెండు రోజులుగా తనను ఉద్దేశించి...

బ్రేకింగ్: చంద్రబాబు –...

ఏపీలో ప్రస్తుతం జరుగుతోన్న రాజకీయ పరిణామాలు...

సింఘాల్‌ సరే.. తర్వాత...

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి...

అందరి బ్రతుకు నాకు...

గతవారం పది రోజుల నుంచి ఏపీలో...

పోల్స్