Wednesday, March 25, 2026 03:07 PM
Wednesday, March 25, 2026 03:07 PM

బీ అలర్ట్.. రైల్వే రిజర్వేషన్‌లో మార్పులు..!

ప్రయాణీకులకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు రైల్వే శాఖ కీలక సంస్కరణలు అమలు చేస్తోంది. ఇప్పటికే అన్ని రైల్వే ట్రాక్‌లను 130 కిలోమీటర్ల వేగంతో రైళ్లు ప్రయాణించేందుకు అనుగుణంగా మార్పులు చేస్తున్నారు. వీటితో పాటు త్వరలో బుల్లెట్ రైలు కారిడార్‌ కూడా భారత్‌లో అందుబాటులోకి రానుంది. ఇక ఇప్పటికే రైల్వే ప్రయాణీకులకు వందే భారత్ వంటి హై స్పీడ్ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. వీటి గరిష్ఠ వేగం గంటకు 180 కిలోమీటర్లు అయినప్పటికీ.. ప్రస్తుతం ట్రాక్ సామర్థ్యం ఆ స్థాయిలో ఇంకా అభివృద్ధి చేయాల్సి ఉంది. ప్రీమియం రైళ్ల ద్వారా ప్రయాణీకులకు మరిన్ని సౌకర్యాలు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు రైల్వే శాఖ కృషి చేస్తోంది.

Also Read : అమెరికా గడ్డపై ఇరాన్ దాడి..? అమెరికన్లలో వణుకు మొదలు..!

సాధారణంగా రైళ్లల్లో రిజర్వేషన్ టికెట్ పొందాలంటే.. అదో పెద్ద ప్రస్తానం. గతంలో 120 రోజుల ముందు… అంటే.. ఏకంగా 4 నెలల ముందు టికెట్లు బుక్ చేయాల్సి వచ్చేది. దీని వల్ల ప్రయాణీకులకు డబ్బు వృధా కూడా. పైగా చివరి నిమిషంలో ప్రయాణం చేయాల్సిన వారికి తగినన్ని సీట్లు అందుబాటులో ఉండేవి కూడా కాదు. పైగా వీటిని బ్లాక్ మార్కెట్‌లో పెద్ద ఎత్తున విక్రయించిన సందర్భాలు కూడా ఉన్నాయి. వీటికి చెక్ పెట్టేందుకు ఐఆర్‌సీటీసీ ద్వారా ఆధార్ కార్డు, ఫోన్ నంబర్ వంటి వివరాలతో పాటు బుకింగ్ రూల్స్ కూడా భారీగా మార్చేసింది రైల్వే శాఖ. దీని వల్ల బ్లాక్ టికెటింగ్ తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం 120 రోజుల గడువును కూడా 60 రోజులకే కుదించింది.

Also Read : మర్యాదగా ఉండు.. కోపం వద్దు.. గంభీర్ కు గంగూలీ సలహా..!

ఇక తాజాగా ముందుగా రిజర్వేషన్ చేసుకున్న వారికి.. చివరి నిమిషంలో ప్రయాణం రద్దు అయితే.. అలాంటి వారికి రిఫండ్ రూల్స్‌లో కూడా భారీగా మార్పులు చేసింది రైల్వే శాఖ. రైలు ప్రయాణ సమయానికి 72 గంటల ముందు టికెట్ క్యాన్సిల్ చేసుకుంటే రిజర్వేషన్ ఛార్జీలు మాత్రమే వసూలు చేసి.. మొత్తం రిఫండ్ చేస్తారు. ఇక ప్రయాణ సమయానికి 72 గంటల నుంచి 24 గంటల మధ్య టికెట్ క్యాన్సిల్ చేసుకుంటే.. టికెట్ ధరలో 25 శాతం కోత పెడతారు. రైలు ప్రయాణ సమయానికి 24 గంటల నుంచి 8 గంటల మధ్య అయితే టికెట్ ధరలో 50 శాతం కోత.. ఇక ప్రయాణ సమయానికి 8 గంటల లోపు అయితే మాత్రం.. జీరో రిఫండ్ అని రైల్వే శాఖ ప్రకటించింది. ఈ కొత్త నిబంధనలు ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. టికెట్ క్యాన్సిల్ చేసుకున్న వారి స్థానంలో ఆర్ఏసీ వారికి ముందుగా ప్రాధాన్యత ఉంటుంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్...

సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏది...

బ్రేకింగ్; ఏపీలో మున్సిపల్...

ఏపీలో స్థానిక సంస్థల సమరానికి మున్సిపల్...

కిమిడి సోదరుల మధ్య...

తెలుగు రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న...

బ్రేకింగ్: డేంజర్ జోన్...

ఏపీలోని బెజవాడ నగరం వేదికగా సాగుతున్న...

బ్రేకింగ్: మాట నిలబెట్టుకున్న...

గత కొన్ని రోజులుగా విమర్శలు ఎదుర్కొంటున్న.....

ఏపీపై రైల్వే శాఖ...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధిలోకి...

పోల్స్