Sunday, March 22, 2026 01:16 PM
Sunday, March 22, 2026 01:16 PM

25 ఎకరాల భూమి కోసం అసోం సీఎంకు చంద్రబాబు లేఖ.. ఏంటీ స్టోరీ..?

కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు శ్రీవారి ఆలయాల నిర్మాణానికి తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి అడుగులు వేస్తోంది. ఆధ్యాత్మిక భావాలను ప్రజల్లో పెంపొందించేందుకు పాలకమండలి కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడుతూ భూ కేటాయింపులు, నిధుల మంజూరు వంటివి దూకుడుగా అడుగులు వేస్తోంది. హిందూ ధర్మాన్ని కాపాడేందుకు బోర్డు ఇటీవల కాలంలో భారీగా నిధులు ఖర్చు చేస్తుంది. అటు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పూర్తిస్థాయిలో సహకారం ఉండటంతో.. తనవంతుగా పూర్తిస్థాయిలో కృషి చేస్తున్నది.

Also Read : దేవాలయాలకు టీటీడీ అద్భుత కానుక..!

తాజాగా తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధికి కూడా నడుం బిగించింది టీటీడీ. 30 కోట్ల రూపాయల నిధులను కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక ఇప్పుడు తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అస్సాం రాజధాని గౌహతిలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి టీటీడీ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపద్యంలో అదనపు భూమి కోసం అస్సాం సీఎంకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. దీనితో గౌహతిలో శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య క్షేత్రం నిర్మాణానికి తొలుత కేటాయించిన 10.8 ఎకరాల భూమికి బదులుగా.. 25 ఎకరాల భూమిని కేటాయించేందుకు అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Also Read : టీడీపీ తో పొత్తుపై పవన్ కీలక కామెంట్స్

అస్సాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య జరిగిన సంప్రదింపుల తర్వాత ఈ కీలక నిర్ణయం వెలవడింది. దీనితో ఇరువురు ముఖ్యమంత్రులకు టిటిడి ట్రస్ట్ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు ధన్యవాదాలు తెలిపారు. అటు ముంబైలోని బాంద్రా ప్రాంతంలో 14.4 కోట్లతో శ్రీవారి ఆలయ నిర్మాణానికి ఇటీవల బోర్డు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అలాగే టిటిడి ఆలయాలకు ధ్వజ స్తంభాలు, రధాలు తయారు చేసేందుకు పలమనేరులో 100 ఎకరాల్లో వృక్షాలు పెంచేందుకు కూడా నిర్ణయం తీసుకున్నారు. ఇదే సమయంలో తిరుపతిలోని శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయంలో.. అత్యాధునిక సౌకర్యాలు కల్పించేందుకు బోర్డు 48 కోట్ల రూపాయలను కేటాయించింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్