Sunday, March 22, 2026 05:01 AM
Sunday, March 22, 2026 05:01 AM

ఎమ్మెల్యేలకు బాధ్యత లేదా..? సిఎం సీరియస్..!

గత కొన్నాళ్ళుగా అధికారులు, ప్రజా ప్రతినిధుల విషయంలో సీరియస్ గా ఉన్న సిఎం చంద్రబాబు.. పలు సందర్భాల్లో వారిపై నేరుగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. తాజాగా సిఎం.. మరోసారి అధికారుల తీరును తప్పుబట్టారు. తాను సీరియస్ గా తీసుకుని చేస్తున్న అంశాలను అధికారులు, ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదనే అసహనం వ్యక్తం చేసారు సిఎం. తూర్పు గోదావరి జిల్లా రాయవరంలో పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సిఎం.. కీలక వ్యాఖ్యలు చేసారు.

Also Read : చంద్రబాబు ఫిట్నెస్ కు పెమ్మసాని షాక్.. ఎలా ఇలా..?

రైతులకు పాస్‌బుక్‌ల పంపిణీ పవిత్రమైన కార్యక్రమమన్నారు. భూమి అనేది ప్రతి ఒక్కరికీ భావోద్వేగ విషయం.. ప్రాణం పోయినా భూమి కోల్పోయేందుకు రైతులు ఇష్టపడరని తెలిపారు. రైతులు కరోనా సమయంలోనూ పనిచేసి అందరికీ అన్నం పెట్టారు.. సున్నితమైన అంశంతో పెట్టుకోవద్దని గత సీఎంకు చెప్పా.. వినలేదన్నారు. రైతుల భూమి పత్రాలపై జగన్‌ ఫోటో ఎందుకు వేశారో అర్థంకాలేదని వ్యాఖ్యానించారు. రైతుల భూములను అధికారుల ద్వారా తన చేతుల్లో పెట్టుకుని ఇబ్బంది పెట్టారన్నారు.

Also Read : వెనిజులా చమురు భారత్ కు..? అమెరికా సంచలన నిర్ణయం..!

ఒకవేళ కూటమి ప్రభుత్వం రాకుంటే రైతుల భూములు గోవిందా.. గోవిందా అంటూ వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వ నేతలు ప్రమాదకరమైన ఆలోచనలు చేశారు.. 22-ఏ తెచ్చి రైతులను కష్టాలు పెట్టాలని ప్రయత్నించారని మండిపడ్డారు. ‘మీ భూమి.. మీ హక్కు’ అని ఎన్నికల ప్రచారంలోనే చెప్పా.. రాజముద్ర వేసి మళ్లీ పాస్‌బుక్‌లు ఇస్తానని గతంలోనే హామీ ఇచ్చానని, రైతులంతా సరైన సమయంలో సరైన తీర్పు ఇచ్చారన్నారు. ఇక అధికారుల గురించి మాట్లాడుతూ.. పాస్ పుస్తకాల పంపిణీలో నిర్లక్ష్యంపై సీరియస్ అయ్యారు. ప్రభుత్వ స్ఫూర్తికి భిన్నంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇంకోసారి ఇలా చేస్తే కఠినంగా వ్యవహరిస్తా అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఎమ్మెల్యేలు కూడా బాధ్యతగా వ్యవహరించాలని చురకలు అంటించారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్