Thursday, February 5, 2026 04:24 AM
Thursday, February 5, 2026 04:24 AM

అలాంటి వారితోనే ఇబ్బందులు.. బాబు నైరాశ్యం..!

టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారం రేపుతున్నాయి. నేను కూడా తొందరపడ్డానేమో.. అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను పార్టీ శ్రేణులు కూడా సమర్థిస్తున్నారు. పార్టీ పట్ల, పార్టీ సిద్ధాంతాల పట్ల నిబద్ధత లేని వారికి టికెట్లు ఇచ్చారని వ్యాఖ్యానిస్తున్నారు. మరోసారి ఇలాంటి తప్పు జరగకుండా జాగ్రత్తలు పడాలని.. అలాగే పార్టీ లైన్ దాటుతున్న వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని కూడా సూచిస్తున్నారు.

తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని మధ్య విభేదాలు తలెత్తడంపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో క్రమశిక్షణ సంఘం సభ్యులతో చంద్రబాబు భేటీ అయ్యారు. అసలు సమస్యకు మూలాలు ఏమిటనే విషయంపై ఆరా తీశారు. ఇద్దరినీ పిలిచి వివరణ తీసుకోవాలని ఆదేశించారు. లండన్ పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత చిన్ని, కొలికపూడితో స్వయంగా మాట్లాడుతానని చంద్రబాబు స్పష్టం చేశారు.

Also Read : రచ్చ చేసేందుకు సీనియర్ రెడీ..!

ఇదే సమయంలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ సిద్ధాంతాలు, కట్టుబాట్లు గురించి తెలియనివారికి, రాజకీయ అనుభవం లేనివారికి టికెట్లిస్తే ఇలాంటి సమస్యలే వస్తాయని చేసిన వ్యాఖ్యలు.. పార్టీలో అంతర్గత కలహాలకు దారి తీస్తున్న వారి గురించే అనే మాట వినిపిస్తోంది. నిన్నటి వరకు ఇతర పార్టీలో అధికారం అనుభవించిన వారు.. పార్టీ మారిన వెంటనే.. పదవులివ్వడం పట్ల ఇప్పటికే తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తీరుపై సొంత పార్టీ నేతలే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కోసం ఎప్పటి నుంచో పని చేస్తున్న వారిని కాదని.. తమ అనుచరులకే పదవులిస్తున్నారని.. నియోజకవర్గాల్లో గ్రూప్ రాజకీయాలను ప్రొత్సహిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

తాజాగా కావలిలో రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మాలేపాటి సుబ్బానాయుడు ఆకస్మిక మృతి తర్వాత పరిణామాలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారి తీశాయి. సుబ్బానాయుడు సంతాప కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిపై స్థానిక టీడీపీ నేతలు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. వైసీపీ వారికే ఎక్కువ పదవులిస్తున్నారంటూ ఆరోపించారు. ఇలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని బహిరంగంగానే పార్టీ అధినేత చంద్రబాబుకు సూచనలిచ్చారు.

Also Read : ఆ ఎమ్మెల్యేల లిస్ట్ కావాలి.. చంద్రబాబు సంచలన ఆదేశాలు

పార్టీ సిద్దాంతాలు, కట్టుబాట్లు తెలియని వారికి టికెట్ ఇవ్వడం ఏమిటనే మాట ఇప్పుడు తిరువూరులో కూడా వినిపిస్తోంది. పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహరిస్తున్న తీరుపై స్థానిక టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. మహిళలతో అసభ్యకరంగా వ్యవహరిస్తున్నారని.. జగన్ సన్నిహితులైన వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనేది ప్రధాన ఆరోపణ. అలాగే భారీ ఎత్తున అవినీతి చేస్తున్నారనేది కొలికపూడి గురించి తిరువూరు ప్రజల అభిప్రాయం. అమరావతి ఉద్యమంలో ఉన్నారనే ఏకైక కారణంతో ఎమ్మెల్యే టికెట్ ఎలా ఇచ్చారని టీడీపీ నేతలే ప్రశ్నిస్తున్నారు. పార్టీ అధినేత మాటకు కట్టుబడి కొలికపూడిని గెలిపించుకున్నామన్నారు. కానీ ఆయన మాత్రం పార్టీ లైన్ దాటి వ్యవహరిస్తున్నారని తిరువూరు టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటి కైనా ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

గుంటూరు కారమా.. మజాకానా…!

గుంటూరు కారం పవర్ ఇన్నాళ్లకు కన్పించింది.....

బాబు-పవన్ భేటీ.. ఆ...

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్...

చంద్రబాబు సలహదారుగా మళ్లీ...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్...

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

పోల్స్