Sunday, March 22, 2026 12:57 PM
Sunday, March 22, 2026 12:57 PM

మార్చొద్దు.. ఏపీ బిజేపి చీఫ్ పై చంద్రబాబు ఒపినియన్…!

ఆంధ్రప్రదేశ్ లో బిజెపి అధ్యక్ష పదవి విషయంలో చాలామంది ఆశపడుతున్నట్లు ఈ మధ్యకాలంలో ప్రచారం జరిగింది. ముగ్గురు నలుగురు పేర్లు ప్రధానంగా ప్రస్తావనకు వచ్చాయి. కానీ ఎవరినీ ఇప్పటివరకు బిజెపి అధిష్టానం ఖరారు చేయలేదు. ఇక దీనిపై ప్రచారం కూడా దాదాపుగా ఆగిపోయింది. అయితే బిజెపి రాష్ట్ర అధ్యక్ష పదవిని మార్చే విషయంలో బిజెపి అధిష్టానం పెద్దగా సానుకూలత వ్యక్తం చేయడం లేదనేది ప్రధానంగా వినపడుతున్న మాట. అలాగే రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం, జనసేన కూడా బిజెపి రాష్ట్ర అధ్యక్ష పదవిని పురందరేశ్వరికి కాకుండా మరొకరికి ఇచ్చేందుకు ఆసక్తి చూపించడం లేదని ప్రచారం జరుగుతోంది.

Also Read : రేవంత్‌ను ఎదుర్కోవాలంటే కేసీఆర్‌కు బీజేపీనే ఆయుధమా…?

2014 నుంచి 2019 వరకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు అలాగే కొంతమంది నాయకుల కారణంగా ఎన్డీఏలో చీలిక వచ్చింది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న చంద్రబాబు నాయుడు బిజెపి పెద్దలకు ఇప్పటికే స్పష్టంగా చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. బిజెపి రాష్ట్ర అధ్యక్ష పదవిలో పురందరేశ్వరిని కొనసాగించాలని.. మరో నేతకు అప్పగిస్తే అనవసరంగా సమస్యలు వచ్చే అవకాశం ఉందని చెప్పారట. ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా బిజెపి పెద్దల వద్ద ఇదే అంశాన్ని ప్రస్తావించినట్లు వార్తలు వస్తున్నాయి.

Also Read : అధ్యక్ష అంటావా.. ఇంట్లో ఉంటావా..?

దీనితోనే బిజెపి అధ్యక్ష పదవి విషయంలో ఆ పార్టీ అధిష్టానం సైలెంట్ అయిపోయిందని సమాచారం. ప్రస్తుతం పురందరేశ్వరి కి అటు జనసేనతో గాని ఇటు టిడిపితో గాని ఎటువంటి ఇబ్బందులు లేవు. దీనితో ఆమెని కొనసాగిస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని కూడా బిజెపి జాతీయ స్థాయి నాయకత్వం వ్యక్తం చేస్తోందట. ఇక తెలంగాణలో మాత్రం అధ్యక్ష పదవి విషయంలో ఓ అంచనాకు రాలేకపోతున్నారు. ఏపీలో ఇబ్బందులు లేకపోవడంతో ఇప్పుడు పార్టీలో పదవులు విషయంలో పెద్దగా వేలు పెట్టొద్దని బిజెపి భావిస్తోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్