Sunday, March 22, 2026 05:01 AM
Sunday, March 22, 2026 05:01 AM

దావోస్ మ్యాన్.. చంద్రబాబు ఊహించని గౌరవం..!

రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు.. దావోస్ పర్యటనకు వెళ్ళారు. గూగుల్ సంస్థ రాకతో జోష్ లో సిఎం.. ఇప్పుడు పెద్ద ఎత్తున పరిశ్రమలను ఆహ్వానించేందుకు పర్యటిస్తున్నారు. దావోస్ లో నాలుగు రోజుల్లో రికార్డు స్థాయిలో 36 కీలక సమావేశాలను నిర్వహించనుంది ఏపీ బృందం. ప్రపంచ పెట్టుబడిదారులతో కీలక చర్చలు జరపనున్నారు సిఎం. తాజాగా జ్యూరిచ్‌లో ‘తెలుగు డయాస్పోరా’ సమావేశంలో ఏపీ బృందం పాల్గొంది.

Also Read : అమాయకుడి ముసుగులో నేరగాడు.. పిన్నెల్లి ఘటనపై సంచలన నిజాలు

డయాస్పోరా సమావేశానికి కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు, రాష్ట్ర మంత్రులు లోకేష్, టీజీ భరత్ సహా అధికారులు హాజరు అయ్యారు. జ్యూరిచ్‌లో రెండోసారి తెలుగు డయాస్పోరాతో సీఎం చంద్రబాబు సమావేశం కావడం గమనార్హం. ఈ భేటీ కోసం ఐరోపాలోని 20 దేశాల జ్యూరిచ్ వెళ్ళడం విశేషం. ఇదిలా ఉంచితే.. ఈరోస్ ఇన్నోవేషన్ చైర్మన్.. కిషోర్ లుల్లాతో సిఎం చంద్రబాబు పరిచయం అయ్యారు. ‘దావోస్ మ్యాన్’ అంటూ సీఎం చంద్రబాబును తన సహచరులకు ఈరోస్ ఛైర్మన్ కిషోర్ లుల్లా పరిచయం చేసారు.

Also Read : మిథున్ రెడ్డికి గాలం.. రంగంలోకి ఈడి

ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై కిషోర్ లుల్లాతో సీఎం చంద్రబాబు చర్చించారు. ఏఐ, డీప్‌టెక్, డిజిటల్ కంటెంట్ రంగాలపై చర్చ జరిగింది. జెన్ ఏఐ, ఐఏ ఆధారిత ఫిల్మ్‌సిటీ, వర్చువల్ స్టూడియోలు, ఏఐ టెక్ హబ్ గురించి ఈరోస్ ప్రతినిధులు వివరించారు. ‘డిస్కవర్ ఆంధ్రప్రదేశ్ 360’ పేరుతో ప్రచార కార్యక్రమాలు రూపొందిస్తున్నామని ఈరోస్ పేర్కొనగా.. డిజిటల్ మీడియా, వర్చువల్ ప్రొడక్షన్, గేమింగ్, యానిమేషన్, ఫిల్మ్ టెక్నాలజీలో పెట్టుబడులు ప్రోత్సహిస్తున్నామని సిఎం తెలిపారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్