Sunday, March 22, 2026 01:15 PM
Sunday, March 22, 2026 01:15 PM

ఛీ ఇలాంటి వారితో రాజకీయమా..? చంద్రబాబు సంచలనం

ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు కాసేపటి క్రితం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేసారు. ఏపీ జీఎస్డీపీపై సచివాలయంలో మాట్లాడిన సిఎం.. ప్రతీ త్రైమాసికం, ఆర్ధిక సంవత్సరంలో సాధిస్తున్న రాష్ట్ర స్థూల ఉత్పత్తిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఒక్కోక్కటిగా అమలు చేస్తున్నాం.. చేయలేమని మేం పారిపోవటం లేదని తెలిపారు. రాష్ట్రాన్ని పరుగులు పెట్టించేలా చూస్తున్నామన్నారు. ప్రజల కోసం ఎంత కష్టమైనా సరే బాధ్యత తీసుకుని అభివృద్ధి చేస్తామని స్పష్టం చేసారు.

పరకామణిలో డబ్బులు కొట్టేసిన వ్యవహారాన్ని చిన్న నేరం అని చెప్పడాన్ని ఏమనాలి..? దేవాలయంలో దేవుడి దగ్గర సొమ్మును చోరీ చేస్తే దానిని సమర్ధిస్తారా అంటూ మండిపడ్డారు. కలియుగ దైవం వేంకటేశ్వర స్వామి ఆలయంలోనే చోరీ జరిగితే అది చిన్నదని ఎలా సమర్థిస్తారు..? అని నిలదీశారు. గతంలో నాసిరకం ప్రసాదాన్ని భక్తులకు ఇచ్చినా దానిని కూడా సమర్ధిస్తారా..? అని ప్రశ్నించారు. కల్తీ నెయ్యి స్వామివారి ప్రసాదం తయారీకి సరఫరా చేసిన ఘటనను వెనకేసుకు వస్తారా..? అని ప్రశ్నల వర్షం కురిపించారు.

Also Read : నోరు జాగ్రత్త జగన్.. వేమిరెడ్డి స్టాంగ్ వార్నింగ్

ఇలాంటి వాటిని సమర్థిస్తున్న వ్యక్తులు ప్రతిపక్షంలో ఉన్నారని, ఇలాంటి వారితో రాజకీయం చేయడానికి నాకు సిగ్గు అనిపిస్తోందన్నారు. సింగయ్య అనే వ్యక్తిని కారు కింద తొక్కించేసి ఆయన భార్యతోనే మాపై ఆరోపణలు చేస్తూ మీడియా సమావేశం పెట్టించారని, హైదరాబాద్ నుంచి మద్యం సేవిస్తూ వచ్చి ప్రమాదంలో మరణిస్తే.. ఆ ఘటనను కూడా హత్య కింద చిత్రీకరించే ప్రయత్నం చేశారని ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రతీ అంశంలోనూ ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని, ఓ దేవాలయంలో ఈవో చోరీ చేస్తే తక్షణం సస్పెండ్ చేశామని పేర్కొన్నారు.

సుపరిపాలన ద్వారా ప్రజల వద్దకు వెళ్లాం, వాట్సప్ గవర్నెన్సు ద్వారా ప్రజల చేతుల్లోకి పాలనను తీసుకెళ్లామన్న ఆయన.. డీఫంక్ట్ అయిన వివిధ కేంద్ర పథకాలను మళ్లీ పునరుద్ధరించామని, గత ప్రభుత్వం పీపీఎలు రద్దు చేయడం వల్ల ఎలాంటి విద్యుత్ వాడుకోకుండా రూ.9 వేల కోట్లు చెల్లించాల్సి వచ్చిందని, కక్షపూరిత రాజకీయాలతో గత పాలకులు ప్రజాధనాన్ని నష్టం చేశారని మండిపడ్డారు. ఈ వ్యవస్థలన్నీ గాడిలో పెట్టి ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా ముందుకు వెళ్తున్నామన్నారు.

Also Read : బ్రేకింగ్: గంభీర్ కు షాక్ ఇచ్చిన బోర్డు

సమర్ధవంతమైన సాగునీటి వ్యవస్థను కూడా చేపట్టాం.. 950 టీఎంసీల నీరు రిజర్వాయర్లలో నిల్వ ఉందని తెలిపారు. విభజన కారణంగా వ్యవస్థీకృతంగా ఆంధ్రప్రదేశ్ కు ఇబ్బందులు వచ్చాయని, వైసీపీ వచ్చి రాష్ట్రాన్ని విధ్వంసం చేసిందన్నారు. తెలుగు రాష్ట్రాలు ఎప్పుడూ అభివృద్ధి సాధించాలని ఇవాళ కూడా ట్వీట్ చేశానని గుర్తు చేసారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, విద్యుత్ సహా వివిధ మౌలిక సదుపాయాలు కల్పించటం వల్ల పరిశ్రమల రంగంలో వృద్ధి నమోదైంది.. వెంటిలేటర్ పై ఉన్న రాష్ట్రాన్ని బయట పడేయగలిగమన్నారు. ఈ ఏడాది 55 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామని పేర్కొన్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్