Monday, October 27, 2025 10:50 PM
Monday, October 27, 2025 10:50 PM
roots

తెలంగాణ టీడీపీని వదిలేసారా.. క్యాడర్ అసహనం..!

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నామని ఆ పార్టీ అధిష్టానం చెబుతూనే ఉంది. పార్టీ నాయకత్వాన్ని బలోపేతం చేసే దిశగా అధిష్టానం అడుగులు వేస్తుందని వార్తలు కూడా వస్తూనే ఉన్నాయి. కానీ ఇప్పటివరకు ఆ పార్టీ భవిష్యత్తు తెలంగాణలో ఏంటి అనేదానిపై మాత్రం క్లారిటీ లేదు. కానీ ఏదో ఒక సందర్భంలో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ గురించి ప్రస్తావన వస్తూనే ఉంది. ఇటీవల కాంగ్రెస్ పార్టీతో పాటుగా భారత రాష్ట్ర సమితి కూడా పరోక్షంగా తెలుగుదేశం పార్టీపై విమర్శలు చేసిన సందర్భాలు కొన్ని ఉన్నాయి.

Also Read : ఏపీ పోలీసుల కొత్త అవినీతి.. వైసీపీ అండదండలతో

ఈ మధ్య కాంగ్రెస్ పార్టీ మంత్రులు కూడా కొన్ని సందర్భాల్లో టిడిపిని టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏపీలో ప్రస్తుతం బలంగా ఉన్న ఆ పార్టీ తెలంగాణలో నాయకులను చేర్చుకుని తిరిగి పుంజుకునే అవకాశాలు ఉన్నాయని వార్తలు ఎప్పటి నుంచో వస్తున్నాయి. కానీ నాయకుల చేరికపై ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. గత ఏడాది పలువురు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో భేటీ అయినా సరే ఇప్పటివరకు వాళ్లు పార్టీలో జాయిన్ కాలేదు. అసలు టిడిపి అధినేత చంద్రబాబు మనస్సులో ఎలాంటి ప్రణాళిక ఉందో ఇప్పటివరకు తెలంగాణ నాయకులకి కూడా క్లారిటీ లేదు.

Also Read : ఎన్టీఆర్ పై విజయ్ దేవరకొండ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

తెలంగాణ టిడిపి అధ్యక్షుడి ఎంపిక కూడా త్వరలోనే ఉంటుందనే ప్రచారం జరిగింది. తెలంగాణా టిడిపి అధ్యక్ష పదవికి పోటీ కూడా తీవ్రంగానే ఉంది. అలాగే నియోజకవర్గ స్థాయి పదవులపై కూడా పార్టీ దృష్టి పెట్టిందని.. బిజెపి తో కలిసి ఎన్నికలకు వెళుతుందని ప్రచారం జరుగుతున్న సరే.. ఒక్క అడుగు కూడా ముందుకు పడటం లేదు. పార్టీలోకి వచ్చేందుకు నేతలు సిద్ధంగా ఉన్నా సరే వారిని తీసుకునేందుకు అధిష్టానం సిద్ధంగా లేకపోవడం విస్మయానికి గురిచేస్తుంది. ఓవైపు తెలంగాణలో భారత రాష్ట్ర సమితి మళ్లీ బలం పుంజుకునే ప్రయత్నం చేస్తుంది. టిడిపికి ప్రస్తుతం సానుకూల వాతావరణం కనబడుతున్నా సైలెంట్ గా ఉండటం వెనుక వ్యూహం ఏంటి అనేది ఎవరికీ అర్థం కాని పరిస్థితి. దీనితో తెలంగాణ టిడిపి కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్